సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చేవారంతా మంచి క్రేజ్ సంపాదించుకునేందుకు చాలా సమయం పడుతుంది. అయితే.. కొందరు చైల్డ్ ఆర్టిస్టులు ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ దక్కించుకుంటారు. ఆ కోవకే చెందుతుంది ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఫేమ్ బేబీ వర్ణిక. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి మేనకోడలిగా నటించింది వర్ణిక. 2015లో విడుదలైన ఈ సినిమాలో స్వీటీ క్యారెక్టర్ లో ఎంతో ముద్దుగా ఆకట్టుకుంది వర్ణిక.
ఇక సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాలో చిన్నప్పటి రకుల్ గా కనిపించింది. అయితే.. తెలుగులో మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైన వర్ణిక.. నాన్నకు ప్రేమతో మూవీ తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు యాక్టీవ్ గా ఉంటోంది. ప్రస్తుతం బేబీ వర్ణిక తన చదువుపై దృష్టి పెట్టిందని.. అందుకే సినిమాలకు దూరంగా ఉంటోందని సమాచారం.
ఇదిలా ఉండగా.. 7 ఏళ్ళ కిందట చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసిన బేబీ వర్ణిక ఇప్పుడు ఎలా ఉందో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ టైంలో పాప రోల్ కోసం చైల్డ్ ఆర్టిస్ట్ లను ఆడిషన్ చేద్దామనుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్. అంతలోనే బేబీ వర్ణిక ఫొటోలు నచ్చడంతో ఆమె తల్లిదండ్రులను ఒప్పించి సినిమాలో పరిచయం చేశారు. ప్రస్తుతం వర్ణిక స్కూల్ కి వెళ్తోందని సమాచారం. అదీగాక వర్ణిక ఇప్పుడెలా ఉందో ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మరి బేబీ వర్ణిక ఇప్పుడెలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.