సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధాదాస్.. ఆర్య 2, డార్లింగ్, మొగుడు, గుంటూరు టాకీస్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. సింగర్దాన్, స్లీపర్ సెల్, ప్యూర్ సోల్ వెబ్ సిరీస్ లలో ఘాటు ప్రదర్శనతో మత్తెక్కించిన శ్రద్ధాదాస్.. ఖాకీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దీని కోసం శ్రద్దా ముంబైలోనే ఉంటుంది. తాజాగా గోవా వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. రెగ్యులర్ గా సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది బోల్డ్ బ్యూటీ. ఇదే క్రమంలో ఇంకాస్త ఘాటుతనం పెంచేసి బికినీలో దర్శనమిచ్చింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని.. బికినీలో సెల్ఫీ దిగిన ఫోటోలను షేర్ చేసింది.
ప్రకృతి అందాలను నేను ఆస్వాదిస్తాను, మీరు నా అందాలను ఆస్వాదించండి అంటూ ఇన్స్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది. గోవాలో మండ్రేమ్ సిటీలో రిలాక్స్ అవుతున్న ఫోటోలను షేర్ చేసింది. ఇగో అబ్బాయిలు నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర రిలాక్స్ అవుతున్నా అంటూ 5 ఫోటోలను కుర్రాళ్ళ గుండెల్లో అప్ లోడ్ చేసింది. ఆ హెవీ లోడ్ కి గుండెలు కిందకి జారిపోతాయేమో అనిపిస్తుంది. బోల్డ్ లుక్ లో దర్శనమిస్తూ కుర్రాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కుండపోత వర్షం కురిసినట్టు.. శ్రద్ధాదాస్ అనబడే ఈ అందమైన మేఘం నుంచి సోకుల జల్లులు కురుస్తున్నాయి. ఆ సోకుల జల్లుల్లో కుర్రాళ్ళు తడిసి ముద్దైపోవడం ఖాయం. నిను చూసిన కళ్ళకి ఎప్పటికీ నిదురన్నది రాదు అని కుర్రాళ్ళు పాటలు పాడుకోవడం గ్యారంటీ అనేలా శ్రద్దా దాస్ మస్తు డిస్టర్బ్ చేస్తుంది.
శ్రద్దాదాస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా శ్రద్ధాదాస్ నటించిన ఖాకీ: ది బీహార్ చాప్టర్ అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో శ్రద్ధాదాస్ డీగ్లామర్ రోల్ లో నటించింది. ఈ సిరీస్ ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే.. శ్రద్దాదాస్ ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉండాలి. అప్పుడే కదా జనాలు ఆమె ఏం చేస్తుందో అని తెలిసేది. ఇక తెలుగులో ఢీ సీజన్ 15 షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ కానప్పటికీ.. ఇలా నెట్టింట హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో శ్రద్ధాదాస్ బికినీ ఫోటోలను షేర్ చేసింది. మరి ఈ ఫోటోలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.