ముంబై క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షిప్ లో రేవ్ పార్టీ, డ్రగ్స్ పై విచారణ జరుపుతున్న అధికారులు, రేవ్ పార్టీ ఎవరు నిర్వహిస్తున్నారు? డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు? దీని వెనుక ఎవరెవరున్నారో అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే డ్రగ్స్ కేసు అంత సామాన్య విషయం కాదు.. అందుకే ప్రముఖ క్రిమినల్ లాయర్ షారూఖ్ తనయుడి బెయిల్ కోసం రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. సీనియర్ అడ్వకేట్ సతీష్ మాన్‌షిండేకు ఈ కేసును అప్పగించాడు.
బాలీవుడ్ బిగ్ హీరోల్లో ఒకరైన సంజయ్ దత్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తి, తరఫున ఈయన వాదిస్తున్నారు. 2002లో సల్మాన్ ఖాన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును వాదించి బెయిల్ ఇప్పించడంతోపాటు కేసును సక్సెస్‌గా ముగించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఆర్యన్ ఖాన్‌పై సెక్షన్ 27 (ఏదైనా మాదక ద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాన్ని వినియోగించినందుకు శిక్ష), 8C (ఉత్పత్తి, తయారీ, కలిగి, విక్రయించడం లేదా కొనుగోలు), నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ (NDPS)లోని ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేయబడింది.
ఇక సంజయ్, సల్మాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కేసులు హైర్ చేసుకున్న మనీష్ పాండే అంటే బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న లాయర్.. అందుకే ఈయన ఫీజ్ కూడా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తాడని అంటుంటారు. సతీష్ మాన్‌షిండే ప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ వద్ద శిక్షణ పొందారు. జెఠ్మలానీ వద్ద దాదాపు ఒక దశాబ్దం పాటు అప్రెంటీస్‌గా పని చేసి ఎన్నో మెలుకువలు నేర్చుకున్నారు. జెఠ్మలానీ వద్ద రాటుదేలిన మాన్‌షిండే.. బీ టౌన్ కేసులను సమర్థంగా వాదించి ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.