కన్నడ కంఠీరవుడు రాజ్ కుమార్ ఎన్నో అద్బుతమైన చిత్రాల్లో నటించారు. కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్దము పాటు 200 సినిమాలలో నటించాడు. లక్షలాది అభిమానులు “డాక్టర్. రాజ్” లేదా “అన్నావ్రు” (అన్నగారు) అని పిలిచేవారు. తెలుగునాట సూపర్ స్టార్స్ గా వెలుగొందిన చిత్తూరు వి.నాగయ్య, యన్.టి.రామారావు, ఏ.నాగేశ్వరరావు అంటే రాజ్ కుమార్ కు ఎంతో గౌరవం. యన్టీఆర్ అంటే మరింత అభిమానం. అందుకు కారణం లేకపోలేదు – యన్టీఆర్ తెలుగులో నటించిన అనేక చిత్రాలు కన్నడలో రాజ్ కుమార్ హీరోగా రీమేక్ అయ్యాయి. అంతేకాదు, యన్టీఆర్ లాగా తానూ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో నటించి కన్నడ వాసులను అలరించారు రాజ్ కుమార్.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లు అంటే ఎంతగా అభిమానిస్తారో.. కన్నడ నాట అభిమానులు రాజ్ కుమార్ ని అంత గొప్పగా అభిమానిస్తారు. కన్నడ సినీనటుడు రాజ్‌కుమార్ ని 2000 జూలై 30లో గంధపు చెక్కల, ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్ అపహరించారు. 2000 జూలై 30 తేదీన గజనూర్, తమిళనాడులోని రాజ్ కుమార్ ఫాంహౌస్ పై వీరప్పన్, అనుచరులు చేసిన సాయుధ దాడిలో రాజ్ కుమార్ ను అపహరించారు. రాజ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురిని వీరప్పన్ అపహరించాడు. వీరిని సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు.
108 రోజు తరువాత నవంబర్ 15న విడుదల చేశాడు. ఆ సమయంలో వీరప్పన్ పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేయడానికి రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి. సమాచార పాత్రికేయుడు శివసుబ్రహ్మణ్యన్ రాసిన పుస్తకంలో రాజ్‌కుమార్ విడుదల కోసం మూడు విడతులుగా మొత్తం రూ.15.22 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ ప్రభుత్వం వీరప్పన్ కు అందజేసిందని పుస్తకంలో పేర్కొన్నారు. శివసుబ్రమణ్యన్ వీరప్పన్ జీవితంపై లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్ అనే పుస్తకాన్ని ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఆ టైంలో రాజ్‌కుమార్ కోసం లక్షలాదిమంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలకు దిగారు. తమ అభిమాన నటుడిని విడుదల చేయాలని పెద్ద ఎత్తున గొడవలకు దిగారు.. దాంతో అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం క్రిష్ణ శాటిలైట్ ఫోన్లో వీరప్పన్‌తో చర్చలు జరిపి రాజ్ కుమార్ విడుదలకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు కొన్ని షరతులు అంగీకరించి 108 రోజు తరువాత విడుదల చేశారు. అయితే వీరప్పన్ నటుడు రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసిన సమయంలోఆయన కుటుంబ సభ్యులు ఎంతో మానసిక సంక్షోభానికి గురైనట్లు సమాచారం. మొత్తానికి రాజ్ కుమార్ విడుదల తర్వాత కన్నడ ఇండస్ట్రీ, కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
