కొత్త సంవత్సారం ప్రారంభంలోనే బాక్సాఫీస్ వద్ధ భారీ విజయం నమోదు చేశారు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్యతో.. అభిమానులతో పాటు.. కలెక్షన్ల విషయంలో పూనకాలు తెప్పించేశారు. సంక్రాంతి సందర్భంగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాక.. భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ.. బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తోంది. సూపర్ సక్సెస్‌తో కొత్త ఏడాదిని ప్రారంభించడంతో.. చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలో తనకు ఇంత మంచి సినిమాను ఇచ్చిన దర్శకుడు బాబీకి చిరంజీవి సర్‌ప్రైజ్ గిఫ్ట్ అది కూడా చాలా ఖరీదైన బహుమతి ఇచ్చారట. ప్రస్తుతం ఈ కాస్ట్లీ గిఫ్ట్ గురించి ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకు ఏంటా గిఫ్ట్.. ఎంత ఖరీదు ఉంటుంది అంటే..
మరి కొత్త ఏడాది తనకు ఇంత మంచి సినిమాను ఇచ్చినందుకుగాను.. దర్శకుడు బాబీకి చిరంజీవి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారని సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ కొట్టిన నేపథ్యంలో బాబీని తన ఇంటికి విందుకు ఆహ్వానించిన చిరంజీవి అనంతరం రెండు కోట్ల రూపాయల విలువైల కారుని డైరెక్టర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే.. చిరంజీవి కానీ డైరెక్టర్ బాబీ కాని స్పందించాలి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలుగా.. బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య చిత్రం తెరకెక్కింది. ఈ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించగా.. ఆయనకు తమ్ముడి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటించారు. అన్న, తమ్ముళ్లుగా చిరు, రవితేజ మధ్య సన్నివేశాలు, ఎమోషన్స్, కామెడీ, డాన్సులు అన్నీ ఆడియెన్స్‌ను అలరించారు. ఇక ఈ సినిమాలో శ్రుతీ హాసన్, క్యాథరిన్ హీరోయిన్స్‌గా నటించారు. సంక్రాంతి సందర్బంగా జనవరి 13న విడుదలైన చిత్రం ఇప్పటికే ఓవర్ సీస్ సహా దాదాపు అన్నీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి వాల్తేరు వీరయ్య చిత్రంలో మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.