దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ RRR. రాంచరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2022 జనవరి 7న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే RRR సాంగ్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. RRR రిలీజ్ కి ముందురోజే.. అంటే జనవరి 6న సాయంత్రం ఫస్ట్ షో నుండే అటు USA లో, ఇటు ఇండియాలో ప్రీమియర్స్ మొదలు కానున్నట్లు సమాచారం.
RRR రిలీజుకి ఇంకా వారం రోజులు ఉండగానే సినిమాకి సంబంధించి టాక్ బయటికి వచ్చేసింది. సినిమాలో రాంచరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర చేయగా, గోండు ప్రజలకై పోరాడే కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. అయితే.. సినీవర్గాల టాక్ ప్రకారం.. RRR ఫస్ట్ హాఫ్ లో గోండు ప్రజలకోసం బ్రిటిష్ వారితో ఎన్టీఆర్ పోరాడే సమయంలో.. అల్లూరి సీతారామరాజు(రాంచరణ్) బ్రిటిష్ వారి పోలీస్ గా కనిపిస్తాడు.ఈ క్రమంలో బ్రిటిష్ వారికి ఎదురెళ్ళిన ఎన్టీఆర్ ని రాంచరణ్ అరెస్ట్ చేయాలని చూస్తాడు. అప్పుడే ఇద్దరి మధ్య భారీ ఫైట్ జరుగుతుంది. ఇక్కడే మనకు రాజమౌళి మార్క్ కనిపిస్తుంది. దాదాపు 15 నిమిషాల ఇంటర్వెల్ బ్యాంగ్ తరువాత రాంచరణ్, ఎన్టీఆర్ పోరాటం గురించి తెలుసుకుంటాడు. విషయం తెలిసి రామరాజు, భీమ్ తో చేతులు కలిపి బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడతాడు. ఇక సెకండాఫ్ లో ఎన్టీఆర్, రాంచరణ్ పత్రాలు బ్రిటీష్ వారితో ఎలా పోరాడారు? అనేది చూపించాడు దర్శకుడు.
RRR ప్రమోషన్స్ లో రాజమౌళి చెప్పినట్లుగానే ప్రతి పది నిమిషాలకు ఎమోషనల్ సన్నివేశాలతో సినిమాని మరింత దగ్గరచేసాడు. అలాగే సినిమా చివరివరకు అద్భుతంగా బాహుబలిని మించేలా తీర్చిదిద్దారట మేకర్స్. తాజా సమాచారం మేరకు.. RRR బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. మరి ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.