దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR.. విడుదలై ఏడాది అవుతున్నా.. వరల్డ్ వైడ్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 'నాటు నాటు' సాంగ్ ద్వారా ఆస్కార్ లో నిలిచి.. ఇండియన్ చరిత్రలో అద్భుతమైన రికార్డులను తిరగరాసింది. ఆస్కార్ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కోసం మరో క్రేజీ అప్ డేట్ వచ్చేసింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR.. విడుదలై ఏడాది అవుతున్నా.. వరల్డ్ వైడ్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా హాలీవుడ్ దిగ్గజ దర్శకరచయితలను ఆకట్టుకొని.. ఇప్పటిదాకా ఎన్నో పాపులర్ అవార్డులను తెచ్చిపెట్టింది. అంతేగాక ‘నాటు నాటు’ సాంగ్ ద్వారా ఆస్కార్ లో నిలిచి.. ఇండియన్ చరిత్రలో అద్భుతమైన రికార్డులను తిరగరాసింది. ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు గెలిచిన నాటు నాటు.. ఆస్కార్ కూడా గెలుస్తుందని గట్టినమ్మకంతో ఉన్నారు ఇండియన్స్.
ఇక ఆస్కార్ ఫలితాలు మార్చి 12న రాబోతుండగా.. ఇటీవల ఆర్ఆర్ఆర్ కి సంబంధించి వైబ్ ని కంటిన్యూ చేస్తూ.. అమెరికాలోని చాలా థియేటర్స్ లో ఆర్ఆర్ఆర్ ని రీరిలీజ్ చేశారు. గతేడాది మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశంసలు.. అవార్డులను పక్కన పెడితే.. ఆర్ఆర్ఆర్ ప్రపంచ దేశాలకు విస్తరించడం, ఆయా దేశాల ప్రేక్షకులు సైతం ఆర్ఆర్ఆర్ ని ఓన్ చేసుకోవడం ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. కాగా.. ఆస్కార్ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కోసం మరో క్రేజీ అప్ డేట్ వచ్చేసింది.
ఆర్ఆర్ఆర్ సినిమాని మరోసారి తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారట. అవును.. మార్చి 10 ఆస్కార్ మూమెంట్ ని పూర్తిగా తెలుగు ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఆర్ఆర్ఆర్ ని రీరిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దర్శకుడు రాజమౌళి విజన్ కి.. ఇద్దరు స్టార్ హీరోల క్రేజ్ తోడై.. ఆర్ఆర్ఆర్ ఎటువంటి విజయాన్ని నమోదు చేసిందో కళ్లారా చూశాం. మళ్లీ ఓసారి ఆర్ఆర్ఆర్ లోని ఆ మ్యాజిక్ ని ఎంజాయ్ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారట మేకర్స్. సో.. ఆర్ఆర్ఆర్ రీరిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని, రామరాజుగా చరణ్ ని చూసి పండగ చేసుకునే టైమ్ వచ్చేసిందని ఫ్యాన్స్ నెట్టింట ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆర్ఆర్ఆర్ రీరిలీజ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
#RRRMovie #RRR #NTR #Ramcharan pic.twitter.com/UEgaGEOY1S
— TollywoodBoxoffice.IN (@TBO_Updates) March 5, 2023