'ఆర్ఆర్ఆర్' మూవీకి ఆస్కార్ రావడంతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం లభించింది. ఏకంగా ప్రధాని మోదీతో స్టేజీ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అలానే ఇదే ఈవెంట్ లో చరణ్ ని ఘనంగా సన్మానించబోతున్నట్లు తెలుస్తోంది.
‘ఆస్కార్’ అవార్డు గెలుచుకోవడం మాటేమో గానీ.. ఎక్కడా చూసినా సరే ‘ఆర్ఆర్ఆర్’ గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. సామాన్యుల నుంచి స్టార్ సెలబ్రిటీలు, స్టేట్ సీఎంల వరకు ప్రతిఒక్కరూ ఈ సినిమాను తెగ మెచ్చుకుంటున్నారు. మన సినిమాకు ఆస్కార్ వచ్చిందని గర్వంగా ఓన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికా నుంచి స్వదేశానికి రావడం లేటు.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందానికి ఘన సన్మానాలు జరగడం గ్యారంటీ అని తెలుస్తోంది. తాజాగా హీరో రామ్ చరణ్ కు కూడా అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ప్రధాని మోదీ, దిగ్గజ సచిన్ తో స్టేజీ షేర్ చేసుకునే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఈ విషయం ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ హీరో అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ అవార్డు ఫంక్షన్ కోసం అమెరికా వెళ్లిన చిత్రబృందం.. గత 20 రోజుల నుంచి అక్కడే ఉంది. బుధవారం స్వదేశానికి తిరిగి రానుంది. అయితే భారతదేశానికి వచ్చిన కొన్నిరోజులకే న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కాన్ క్లేవ్ లో చరణ్ పాల్గొనబోతున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ ఈవెంట్ కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానుండటం విశేషం.
న్యూఢిల్లీలో ఈనెల 17,18 తేదీల్లో జరగబోతున్న ఈ ఈవెంట్ లో ప్రధాని మోదీతో పాటు దిగ్గజ సచిన్ కూడా పాల్గొనున్నారు. మన తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటిచెప్పినందుకుగానూ చరణ్ ని ప్రధాని మోదీ సన్మానించబోతున్నారని తెలుస్తోంది. ఇదే స్టేజీపై మాట్లాడబోతున్న చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గ్లోబల్ వైడ్ సక్సెస్ కావడంతో పాటు ఆస్కార్ గెలుచుకోవడం అనే విషయాల గురించి మాట్లాడనున్నాడు. ఏదేమైనా సరే ఓ తెలుగు హీరోకు ఈ రేంజ్ ఆదరణ దక్కడం మనం కచ్చితంగా గర్వించదగ్గ విషయమనే చెప్పాలి. మరి చరణ్.. మోదీ, సచిన్ లాంటి ప్రముఖులతో కలిసి ఈవెంట్ లో పాల్గొనుండటంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.