ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందంటే చాలు.. అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు. సినీ తారల నుండి సీరియల్ ఆర్టిస్టుల వరకు అందరూ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటున్నారు. కెరీర్ తో పాటు పర్సనల్ విషయాలు పోస్ట్ చేస్తున్నారు. అయితే.. బుల్లితెర బ్యూటీగా పాపులర్ అయిన రీతూ చౌదరి గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టీవీ సీరియల్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన రీతూ.. మోడలింగ్ లో కూడా రాణిస్తోంది. గోరింటాకు అనే సీరియల్ ద్వారా యాక్టర్ గా జర్నీ స్టార్ట్ చేసిన రీతూ.. వరుసగా సూర్యవంశం, ఇంటిగుట్టు, అమ్మకోసం సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ క్రమంలో అడపాదడపా సినిమాలతో పాటు యూట్యూబ్ లో సొంత ఛానల్ పెట్టి వ్లాగ్స్ చేస్తుంటుంది. ఇక బుల్లితెర కామెడీ షోలు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లలో స్కిట్స్ చేసి లేడీ కమెడియన్ గా కూడా పేరు తెచ్చుకుంటుంది. అయితే.. టీవీ షోలు, సీరియల్స్ విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో రీతూ చౌదరి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్, ఫాలోయర్స్ కి ఫీజులు అవుట్ అయ్యే రేంజిలో గ్లామర్ షో చేస్తుంటుంది. అదీగాక కొంతకాలం క్రితమే తన బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ ని సోషల్ మీడియా ద్వారా అందరికీ పరిచయం చేసింది.
ఇదిలా ఉండగా.. రీతూ చౌదరి ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంది. షోలలో ఆమె పెర్ఫార్మన్సులు, మాట్లాడే విధానం చూస్తేనే చాలా డేర్ అని అర్థం అవుతుంది. అయితే.. ఎప్పటిలాగే తాజాగా రీతూ ఓ ఇన్ స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేసింది. ఆల్రెడీ బోల్డ్ బ్యూటీగా పేరున్న రీతూ.. ఆ పేరుకు తగ్గట్టుగానే మరోసారి బోల్డ్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో రీతూ.. డ్రెస్ పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా? అంటున్నారు నెటిజన్స్. వీడియోలో చూస్తే థైస్ షో చేస్తూ రెచ్చిపోయింది రీతూ. ప్రస్తుతం రీతూ గ్లామరస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.