ప్రముఖ నటుడు రిచర్డ్ రిషి.. యషిక ఆనంద్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమా చూసిన వాళ్లకు హీరో రిచర్డ్ రిషి గుర్తుండే ఉంటాడు. ఈయన ప్రముఖ మాజీ హీరోయిన్ షాలిని సోదరుడు, హీరో అజిత్‌కు బావమరిది. రిచర్డ్ రిషి బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్‌గా.. హీరో సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆయన సినిమాలు చేశారు. తెలుగులో చివరగా ‘ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి’ సినిమాలో కనిపించారు. తర్వాత తమిళ సినిమాలకు పరిమితం అయ్యారు. తమిళంలో కూడా ప్రస్తుతం అరకొర సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది.
రిచర్డ్ ప్రముఖ తమిళ నటి యషిక ఆనంద్‌తో రిలేషన్‌లో ఉన్నారట. కొద్దిరోజుల క్రితం ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యషికతో దిగిన ఓ ఫొటోలను షేర్ చేశారు. ఓ ఫొటోలో యషిక, రిచర్డ్ బుగ్గపై ముద్దు పెడుతూ ఉంది. దీంతో పుకార్లు రావటం మొదలైంది. అంతేకాదు! వీరి రిలేషన్ చర్చనీయాంశంగా కూడా మారింది. ఎందుకంటే.. రిచర్డ్ రిషి వయసు 45 సంవత్సరాలు. ఇక, యషిక వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. ఇద్దరి మధ్యా దాదాపు 22 ఏళ్ల వయసు తేడా ఉంది. ఈ నేపథ్యంలోనే రిచర్డ్‌పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
కూతురి వయసున్న యువతితో లవ్ ఏంటంటూ మండిపడుతున్నారు. అయితే, అసలు వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారా? లేక వీరిద్దరి మధ్యా ఉన్నది స్నేహం మాత్రమేనా అన్న విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. యషిక కానీ, రిచర్డ్ కానీ, దీనిపై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. వీరిద్దరి మధ్యా రిలేషన్ ఉందా లేదా అన్నది తెలియాలంటే యషిక కానీ, రిచర్డ్ కానీ, స్పందించాల్సిందే. మరి, యషిక, రిచర్డ్ రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.