సాధారణంగా.. నాన్నే పిల్లలకు మొదటి హీరో. తల్లిదండ్రులను చూసే పిల్లలు నడత, నవవడిక నేర్చుకుంటారు. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకు అందరి ఇళ్లల్లోను ఇదే జరుగుతుంది. తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలు సమానం అయినప్పటికి.. ఆడపిల్ల విషయంలో మాత్రం కొందరు వ్యత్యాసం చూపుతారు. చాలా ఇళ్లల్లో ఆడపిల్ల అంటే చిన్న చూపు ఉంటుంది. కానీ కొందరు మాత్రం ఆడపిల్ల పుడితే.. ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ విషయంలో తండ్రి ఓ అడుగు ముందే ఉంటాడు. మగ పిల్లల కన్నా.. ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ చూపే తండ్రులు మన సమాజంలో చాలా మంది ఉన్నారు. ఆడపిల్లకయితే.. తండ్రే హీరో. తమ జీవితంలోకి వచ్చేవాడు.. కూడా తండ్రి తనను చూసుకున్నంత ప్రేమగా చూసుకునేవాడు రావాలని కోరుకుంటారు.
సెలబ్రిటీల పిల్లలు సైతం తల్లిదండ్రులను ఫాలో అవుతుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య.. ఓ పని ద్వారా తాను నాన్న కూచినే అని చెప్పకనే చెప్పింది. ఆద్య అల్లరికి సంబంధించిన వీడియోని రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. నాన్నలానే కూతురు అనే క్యాప్షన్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. ఇక ఈవీడియోలో ఆద్య.. కార్ పైనున్న గ్లాస్ ఒపెన్ చేసి.. తల బయటకు పెట్టి నిలబడి ఎంజాయ్ చేయసాగింది. దీన్ని వీడియో తీసిన రేణు దేశాయ్.. లైక్ నాన్న లైక్ కూతురు అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ప్రస్తుతం రేణు దేశాయ్.. కొడుకు అకీరా నందన్, కుమార్తె ఆద్యలతో కలిసి.. పునేలో ఉంటున్నారు.