ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ కు అనారోగ్యం. ఆ విషయాన్ని స్వయంగా ఆమెనే బయటపెట్టింది. గత కొన్నాళ్ల నుంచి ఈ హెల్త్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ కు అనారోగ్య సమస్యలు. అవును మీరు విన్నది నిజమే. సాధారణంగా నటీనటులు అనగానే.. వాళ్ల ఫేమ్, హోదా చూసి చాలామంది అసూయ పడుతుంటారు. వాళ్లకేంటి రాజు బతుకు అని అనుకుంటూ ఉంటారు. కానీ సదరు సెలబ్రిటీల్లోనూ చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒకప్పుడు అంటే పెద్దగా చెప్పేవారు కాదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సమంత, మమతా మోహన్ దాస్, హంస నందిని, కల్పికా గణేష్ లాంటి భామలు తమ అనారోగ్యం గురించి రివీల్ చేశారు. ఇప్పుడు ఆ లిస్టులోకి రేణు దేశాయ్ కూడా చేరింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బద్రి’ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్.. టాలీవుడ్ లో ‘జానీ’ అని మరో సినిమా చేసింది. 2009లో పవన్-రేణు పెళ్లి జరగ్గా.. 2012లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీళ్లకు అకీరా, ఆద్య అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ల కోసం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఇక హీరోయిన్, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న రేణు దేశాయ్.. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుంది. అదలా ఉండగానే తాజాగా తనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని బయటపెట్టింది.
‘శ్రేయోభిలాషులారా మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. గత కొన్నేళ్ల నుంచి గుండె, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాను. ఈ క్రమంలోనే బలం తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. అనిపించింది. నేను మాత్రమే కాదు నాలా అనారోగ్యంతో బాధపడే వారు బలంగా నిలబడాలనే, పాజిటివ్ ఎనర్జీ కోసమే ఈ పోస్ట్ పెడుతున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాసరే ధైర్యం కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఓ రోజు మనకు ఫలితం వస్తుంది. ఎప్పటికీ ఆశ కోల్పోవద్దు. డిసప్పాయింట్ కావొద్దు. జీవితంతో పాటు మనపై మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మనకు ఎన్నో సర్ ప్రైజులు ప్లాన్ చేసి ఉంచింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాటిని నవ్వుతూ ఫేస్ చేయండి. నాకు ఇప్పడు చికిత్స జరుగుతోంది. మందులు వేసుకుంటున్నాను, యోగా చేస్తున్నాను. మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మాములు మనిషిలా తిరిగొస్తాను’ అని రేణు తన ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చింది. అయితే రేణు దేశాయ్ కు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటనేది మాత్రం ఆమె బయటపెట్టలేదు. రేణు దేశాయ్ పై పోస్ట్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.