అంబర్ పేట వీధికుక్కల ఘటనలో ప్రదీప్ చనిపోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న వర్మ.. కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అంబర్ పేట వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ప్రదీప్ కుటుంబం తరపున పోరాడుతున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ప్రదీప్ కుటుంబానికి న్యాయం చేయాలని ట్వీటర్ వేదికగా ఇప్పటికే పలు ట్వీట్స్ చేసిన సంగతి తెలిసింది. తాజాగా ఆ కుటుంబానికి సాయం చేయండి అంటూ బ్యాంక్ అకౌంట్ నంబర్ ను సైతం సోషల్ మీడియాలో పెట్టారు వర్మ. ఇక ఈ ఘటనపై మరింతగా లోతుగా స్పందిస్తూ.. కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయాలి అంటూ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చాడు.
రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచే వ్యక్తిగా మనకు పరిచయం. కానీ తాజాగా ఓ బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి వార్తల్లోకి ఎక్కాడు. కొన్ని రోజుల క్రితం అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో గాయపడి మరణించిన చిన్నారి ప్రదీప్ కుటుంబానికి అండగా నిలబడ్డాడు వర్మ. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేయర్ ను, ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ..”కుక్కల్ని సంఖ్యను నియంత్రించడానికి ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఉన్న కుక్కలన్నింటిని పట్టుకుని వాటిని ఒక దగ్గర చేర్చి, వాటికి కొన్ని నెంబర్లనో, పేర్లనో పెట్టి జంతు ప్రేమికులకు ఇవ్వండి. లేదా కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇది కుదరకపోతే.. మేయర్ గానీ, అంతకంటే కింది స్థాయి వ్యక్తులు గానీ ఎవరైనా తమ ఆస్తిని కొడుకులకు కాకుండా కుక్కల పెంపకానికి రాసివ్వమనండి అంటూ ఎద్దేవ చేశాడు వర్మ. ఇక నన్ను డబ్బులు అడితే నేను ఇవ్వను ఎందుకంటే నా ప్రియారిటీ అదీకాదు అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. రాజ్యంగా, చట్టబద్దంగా టాక్స్ వేస్తే నేను కట్టడానికి రడీ అని వర్మ తెలిపారు. అంతేగాని ఊరికే అడిగితే నేను డబ్బులు ఇవ్వను అని అన్నాడు. ఇక కుక్కల్ని ప్రేమిస్తున్నాం అంటూ తహతహలాడే వారందరికి టాక్స్ వేయాలని ఈ సందర్భంగా మరోసారి అన్నాడు రామ్ గోపాల్ వర్మ. మరి కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయాలి అన్న RGV వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.