దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు వర్మ డైరెక్షన్‌లో సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరు భావించేవారు. కానీ ప్రస్తుతం ఆయన క్రేజ్‌ను పూర్తిగా దూరం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తోన్న వ్యాఖ్యలు, తీస్తోన్న సినిమాలు అన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గానే నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకునే రాజకీయ, సినీ పరిణామాలపై తరచుగా స్పందిస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాడు. ఘాటు విమర్శలు చేస్తూ వరుస ట్వీట్లు చేశాడు. ఇక తాజాగా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు ఆర్జీవీ. వందేళ్ల కాలంలో ఇలాంటి పవర్‌ఫుల్ స్పీచ్ వినలేదని ప్రశంసించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఆ వివరాలు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన, జనవాణి వాయిదా నేపథ్యంలో అధికార వైసీపీపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. చెప్పు చూపించి మరీ వైఎస్సార్సీపీ నేతలపై జనసేనాని విమర్శలకు దిగారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే.. బాగోదని హెచ్చరించారు. తాను కూడా వారిలా మాట్లాడగలనంటూ.. తన ప్రత్యర్ధులకు నేరుగా చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇక జనసేనాని ప్రసంగం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. త్వరలోనే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుబోతున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ప్రసంగంపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించాడు.
పవన్ కళ్యాణ్ ప్రసంగంపై ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ ప్రశంసలు కురిపించాడు. గత వందేళ్లలో తాను విన్న అత్యంత ప్రభావవంతమైన, అద్భుతమైన స్పీచ్ పవన్ కళ్యాణ్‌దే అన్నాడు. పవన్ చెప్పే ధర్మం మనవాళ్లలో కొందరికి అర్థం కాదన్నాడు. ఓ తీవ్రతతో గుండెల్లోకి చొచ్చుకుపోయేలా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగిందన్నాడు. గత కొంతకాలంగా వర్మ తీరును పరిశీలిస్తున్న జనాలు.. తాజా పరిణామాలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వర్మలో ఈ ఆకస్మాత్తు మార్పుకు కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారు.
The righteousness of it might be seen as impervious in some intrinsic circles but @PawanKalyan ‘s SPEECH is the MOST IMPACTFULLY FANTASTIC i heard in the last one 100 YEARS
— Ram Gopal Varma (@RGVzoomin) October 20, 2022