RGV- అషూరెడ్డి.. ప్రస్తుతం నెట్టింట వీళ్ల పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘డేంజరస్ మా ఇష్టం’ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ చాలా డేంజరస్‌గానే ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే అమ్మాయిలతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేసిన ఆర్జీవీ.. తాజాగా బోల్డ్ బ్యూటీ అషూరెడ్డితో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్నట్లుగా.. ఇద్దరు బోల్డ్ సెలబ్రిటీలు రచ్చ రచ్చ చేశారంటూ ప్రేక్షకులు వాపోతున్నారు. ఇద్దరూ నోటికి ఏది వస్తే అది అనేస్తుంటారు. అలా సినిమా ప్రమోషన్ పేరుతో స్టార్ట్ చేసిన ఇంటర్వ్యూ కాస్తా.. సె*క్స్ అవగాహన తరగతిగా మారిపోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఆర్జీవీ ఇంటర్వ్యూతోనే అషూరెడ్డికి బోల్డ్ బ్యూటీ అనే పేరొచ్చింది. ఈ ఇంటర్వ్యూతో ఆ పేరుని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. సినిమాని గాలికొదిలేసి శృంగార తరగతులు బాగా చెప్పారంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ మొదలైనప్పటి నుంచి ముంగింపు వరకు రామ్‌గోపాల్ వర్మ.. అషూ పాదదాసిగానే ఉండిపోయాడు. ఆమె శరీరాన్ని వర్ణిస్తూ రెచ్చిపోయాడు. ఆమె తొడలు అంటే తనకు ఎంత ఇష్టమో మరోసారి ఆర్జీవీ బయటపెడ్డాడు. కుర్చీలో కూర్చుంటే ఐ టూ ఐ కాంటాక్ట్ ఉంటుందని.. కింద కూర్చుంటేనే తొడలు చూసేందుకు వీలుంటుందని చెప్పుకొచ్చాడు. అషూరెడ్డి కూడా భక్తుడిగా కూర్చున్నావ్ మరి దేవత వరం ఇవ్వాలిగా అంటూ ఆర్జీవీకి అవకాశం ఇచ్చింది.
అషూని పొగుడుతూనే రామ్ గోపాల్ వర్మ ఆమె పాదాన్ని ముద్దాడాడు. అక్కడితో ఆగకుడా ఆమె కాలి వేళ్లను నోట్లో పెట్టేసుకున్నాడు. నీ అందానికి నేను ఫిదా.. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. అషూరెడ్డి ఆర్జీవో కోసమే పుట్టిందంట. అంతేకాదు.. అషూ పెళ్లి, భర్త అంటూ మాట్లాడుతుంటే F*** అస్సలు పెళ్లే చేసుకోవద్దు అంటూ వర్మ ఉచిత సలహా ఇచ్చాడు. అందుకు అషూ కూడా అవును పెళ్లికి నేను కూడా వ్యతిరేకమే అంటూ చెప్పింది. ఇంక తొడల గురించి భజన మొదలు పెట్టేశాడు. అందరూ కళ్లు, బుగ్గలు అంటూ పొగుడుతారు కానీ, తొడలు ఏం పాపం చేశాయని ప్రశ్నించాడు. అషూరెడ్డి మొత్తంగా కావాలా? తొడలు కావాలా అని దేవుడు ప్రత్యక్షమై కోరితే.. నేను అషూ తొడలే కావాలని చెబుతానంటూ సమాధానం చెప్పాడు.
ఇంక వీళ్ల డిస్కషన్ సె*క్స్ దాకా వెళ్లింది. నువ్వు చెప్పేవన్నీ కామ సూత్రాలే అని అంటూ ఉంటారంటూ అషూ చేసిన వ్యాఖ్యని ఆర్జీవీ ఖండించాడు. “నేను చెప్పేది కామసూత్రం కాదు.. ఇంకొకడు చెప్తేగానీ కామం గురించి తెలుసుకోలేకపోతున్నాడు అంటే వాడు కామానికి అనర్హుడు” అంటూ వర్మ ఓ స్టేమ్మెంట్ పాస్ చేశాడు. అందుకు అషూ వాహ్‌వాహ్ అంటూ చప్పట్లు కొట్టింది. ఇంక ఫస్ట్ టైమ్ సె*క్స్ గురించి, వర్జిన్ అబ్బాయిల గురించి అయితే డీప్ డిస్కషన్ చేశారు. తొలిరాత్రి రోజు అబ్బాయిలు మీరే ఫస్ట్ అంటూ యాక్ట్ చేస్తారంది. ఇంక అషూ సె*క్స్- లవ్ గురించి కూడా కామెంట్ చేసింది. ప్రేమలో ఉన్న ఎమోషన్ గ్రేటా? సె*క్స్ లో ఉండే ఎమోషన్ గ్రేటా? అంటూ మాట్లాడింది. సె*క్స్ అంటే 10 నిమిషాలు.. మహా అయితే అరగంట చేస్తారంటూ ఓల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యాబ్‌ని షేక్ చేస్తోంది.