పరిశ్రమలో హీరోలందరీ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది. ఒకరి ఇంట్లో మరొకరు ఫంక్షన్లకు హాజరు కావడం, ఒకరి సినిమాను మరొకరు సపోర్టు చేస్తున్నారు. ఇక చిన్న హీరోలకు అగ్ర నటులు అండగా నిలుస్తున్నారు. వారి సినిమాలో తొలి పాట విడుదల చేయడం దగ్గర నుండి.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు ముఖ్య అతిధులుగా హాజరై.. అభిమానులను కనువిందు చేస్తున్నారు.
మా హీరో అంటే మా హీరో గొప్పని అభిమానుల తన్నుకుంటారు కానీ.. పరిశ్రమలో హీరోలందరీ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది. ఒకరి ఇంట్లో మరొకరు ఫంక్షన్లకు హాజరు కావడం, ఒకరి సినిమాను మరొకరు సపోర్టు చేస్తున్నారు. ఇక చిన్న హీరోలకు అగ్ర నటులు అండగా నిలుస్తున్నారు. వారి సినిమాలో తొలి పాట విడుదల చేయడం దగ్గర నుండి.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు ముఖ్య అతిధులుగా హాజరై.. అభిమానులను కనువిందు చేస్తున్నారు. అగ్ర నటులను.. నేటి తరం నటులు ఎంతో గౌరవిస్తుంటారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని సినిమాలోకి వచ్చామంటూ.. వారిపై అభిమానాన్ని చాటుతుంటారు. అయినప్పటికీ ఆ హీరోకి, ఈ హీరోకి పడదని, ఇండస్ట్రీలో అగ్ర నటులకు సంబంధించిన రెండు కుటుంబాలకు వైరం ఉందని రూమర్లు హల్ చల్ చేస్తుంటాయి. వీటన్నింటికీ సమాధానమే ఈ అరుదైన దృశ్యం.
టాలీవుడ్ అగ్ర నటులైన చిరంజీవి, బాలకృష్ణ కుటుంబాలకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వీరిద్దరూ ఎప్పుడూ కలిసినా.. హాయిగా జోకులు వేసుకుంటూ..నవ్వుకుంటారు. చిరంజీవి పిల్లలతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది బాలయ్య బాబుకు. అయితే గిట్టని వాళ్లు.. వీరికి అస్సలు పడదంటూ రూమర్లను క్రియేట్ చేస్తుంటారు. వీరికి మాటలు లేవంటూ చెబుతారు. వీటిని కొంత మంది నమ్మేస్తుంటారు. కానీ పటా పంచలు చేశారు రామ్ చరణ్, బాలకృష్ణ. తాజాగా శర్వానంద్ రిసెప్షన్‌కు హాజరయ్యారు రామ్ చరణ్, ఉపాసన దంపతులు. వారికి అభినందనలు తెలుపుతూ వెనుదిరుగుతుండగా.. అదే సమయంలో బాలకృష్ణ వచ్చారు. రామ్ చరణ్, బాలయ్య ఎదురు ఎదురు పడగా.. బాలయ్యకు రెండు చేతులతో నమస్కారం చేసిన రామ్ చరణ్.. ఆ తర్వాత దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు.
బాలకృష్ణ కూడా రామ్ చరణ్‌ను చూసి భుజం తట్టి, పలకరించారు. కుశల ప్రశ్నలు అడిగారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే అదిరా రామ్ చరణ్ సంస్కారానికి ప్రతి రూపం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు మెగా అభిమానులు. బాలయ్య ఫ్యాన్స్ కూడా వీరిద్దరినీ ఒకే ఫ్రేములో చూసి పండగ చేసుకుంటున్నారు. గతంలో కూడా అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ వచ్చినప్పుడు..రామ్ చరణ్‌తో బాలకృష్ణ మాట్లాడిన సంగతి విదితమే. మరోసారి పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఫన్నీగా చరణ్ ను ‘ఫిట్టింగ్ మాస్టర్’అంటూ .. అతడు తండ్రి కాబోతున్నందుకు విష్ చేశారు. అలాగే వీరిద్దరి పిల్లలు రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా కూడా చేశారు.