సినీ ఇండస్ట్రీలో ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ మారుతూ ఉంటుంది. మాస్ మూవీస్ దగ్గర నుంచి మల్టీస్టారర్స్ వరకు హీరోలు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ ఉంటారు. కంటెంట్ విషయంలోనూ ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉన్నాయి. అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పదం ‘సినిమాటిక్ యూనివర్స్’. తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పుణ్యామా అని ఈ తరహా సినిమాల్ని చూశాం. రాబోయే రోజుల్లో మరిన్ని చూడబోతున్నామని తెలుస్తోంది. ఇందులో తమిళ హీరోలే ఉండగా.. ఇప్పుడు మాత్రం మెగాహీరో రామ్ చరణ్ కు ఈ యూనివర్స్ లో ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఖైదీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు. గతేడాది ‘విక్రమ్’ సినిమాతో అసలు సిసలు మాస్ ఏంటో చూపించాడు. ఇప్పుడు విజయ్ తో ‘లియో’ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ‘ఖైదీ’-‘విక్రమ్’ సినిమాలతో ఈ ‘లియో’కు సంబంధం ఉంది. ఈ మూవీలో విజయ్ హీరో అని అందరికీ తెలుసు. కానీ ఇందులో దళపతితో పాటు ఎవరెవరు కనిపిస్తారనేది మాత్రం కరెక్ట్ గా క్లారిటీ రావడం లేదు. కొందరేమో కార్తీ అంటున్నారు.. మరికొందరేమో సూర్య అంటున్నారు. పలువురు తెలుగు ఆడియెన్స్ మాత్రం ఏకంగా రామ్ చరణ్ ఉన్నాడని జోస్యం చెప్పేస్తున్నారు.
తాజాగా ‘లియో’ టైటిల్ వీడియోని రిలీజ్ చేశారు. ఫుల్ మాసీగా ఉన్న ఈ టీజర్.. సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తోంది. కశ్మీర్ లో చాక్లెట్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్న విజయ్ కోసం బ్లాక్ కలర్ కార్స్ లో కొందరు ముసుగు వేసుకున్న వ్యక్తులు వస్తున్నట్లు వీడియోలో చూపించారు. అందులో ‘TS 03 BR 2159’ అనే ఓ బండికి నంబర్ ప్లేట్ ఉంది. ఇది చూసిన చాలామంది.. తమిళ సినిమాలో తెలుగు స్టేట్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఉందేంటి అని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇది రామ్ చరణ్ పాత్రకు సంబంధించింది అని అంటున్నారు. గతంలో ‘విక్రమ్’ సక్సెస్ తర్వాత చిరంజీవి.. లోకేష్-కమల్ హాసన్ ని సన్మానించారు. అప్పటినుంచి చరణ్-లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తాడని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇది చూసి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. మరో అడుగు ముందుకేసి.. లియోలో చరణ్ పోలీస్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. మరి విజయ్ ‘లియో’లో రామ్ చరణ్ అంటూ వస్తున్న వార్తలపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Hi @AlwaysRamCharan 🥶💫 https://t.co/9EnLP5Q57T
— LetsCinema (@letscinema) February 8, 2023