మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన పేరెంట్స్ అయ్యారు. ఉప్సీ ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్ న్యూస్‌తో మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు మాస్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత నుంచి ఆయన క్రేజ్ పదింతలు రెట్టింపు అయింది. ఇక, రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్‌గా మారారు చెర్రీ. అందులో రామ్ పాత్రలో ఆయన పలికించిన హావభావాలు విమర్శకులను కూడా ఆకట్టుకున్నాయి. జక్కన్న ఫిలిం తర్వాత వరుస ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్న చరణ్.. ఆ తర్వాత వరుసగా సినిమాలను లైన్లో పెట్టారు. కెరీర్లో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న ఈ మెగా హీరో పర్సనల్ లైఫ్‌లోనూ ఒక విశేషం చోటుచేసుకుంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఇవాళ తల్లిదండ్రులయ్యారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్ న్యూస్‌తో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ ఆనందం కూడా రెట్టింపు అయింది. ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది. మెగా ఇంట్లోకి మంగళవారం ఒక బుజ్జి పాపాయి అడుగు పెట్టింది. ఉపాసనతో పాటు పుట్టిన పాపాయి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. చరణ్‌తో పాటు ఆయన తల్లి సురేఖ ఆస్పత్రిలోనే ఉన్నారు. డెలివరీ అయ్యేంత వరకు ఉప్సీతోనే చెర్రీ ఉన్నారని తెలుస్తోంది. మెగా ఇంట శుభవార్తతో అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు. ఇప్పటికే మెగా ప్రిన్సెస్ పేరిట పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు పిలుపునిచ్చారు.
#RamCharan & #Upasana welcomed their first born, A Girl, in the early hours of Tuesday. Best Wishes to he whole family! pic.twitter.com/amNNctWyAE
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 20, 2023