ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, మీడియాలో ఓరేంజ్‌లో వైరల్ అయిన జంట తమిళ నిర్మాత రవీందర్, సీరియల్ నటి మహాలక్ష్మి. ఏ నిమిషానా వీరు పెళ్లి చేసుకున్నారో కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. వీరికి సంబంధించి ఏదో వార్త.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇక ఈ జంట మీద జరిగినంత ట్రోలింగ్.. ఇప్పటి వరకు ఎవరి మీద జరిగి ఉండదు. మరీ ముఖ్యంగా రవీందర్‌పై విపరీతమైన బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. డబ్బు కోసం మహాలక్ష్మి అతడిని వివాహం చేసుకుందని విమర్శించారు. కానీ కొత్త జంట మాత్రం ఈ విమర్శల్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. తమ జీవితాన్ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హనీమూన్‌కి వెళ్లి వచ్చిన ఈ జంట ప్రసుత్తం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ కొత్త జంటకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే..
బిగ్‌బాస్ ఈ రియాలిటీ షోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం దేశంలోని అన్ని క్రేజీ ఇండస్ట్రీల్లో బిగ్‌బాస్ టెలికాస్ట్ అవుతుంది. మన దగ్గర ఇప్పటికే ఐదు సీజన్‌లు పూర్తి చేసుకోగా.. తాజాగా ఆరో సీజన్ రన్ అవుతోంది. అయితే ప్రారంభంలో ఉన్నంత క్రేజ్ ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్‌కు లేదు. ఇక హిందీ బిగ్‌బాస్‌కు క్రేజ్ ఎక్కువ.. ఖర్చు కూడా భారీగానే పెడతారు. ఇక హిందీ బిగ్‌బాస్ హోస్ట్ చేయడం కోసం సల్మాన్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. కంటెస్టెంట్లకు కూడా ఓ రేంజ్‌లో ముట్టజెప్తారు. టీఆర్పీ విషయంలో కూడా హిందీ బిగ్‌బాస్ టాప్‌లో ఉంటుంది.
ఇక తమిళంలో కూడా బిగ్‌బాస్ షో టెలికాస్ట్ అవుతోంది. ఈ క్రమంలో నిర్మాత రవీందర్, అతడి భార్య మహాలక్ష్మి తమిళ బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంటరవ్వబోతున్నారు అనే వార్త జోరుగా ప్రచారం అవుతుంది. అక్టోబర్ 9 నుంచి బిగ్‌బాస్ సీజన్ 6 ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే వారి జాబితాలో చాలా మంది పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఇందులో రవీందర్-మహాలక్ష్మి ఇద్దరి పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇక బయటే వీరికి ఇంత క్రేజ్ ఉంటే.. ఇక ఈ జంట బిగ్‌బాస్‌లోకి వెళ్తే రచ్చ మామూలుగా ఉండదు. షో నిర్వాహాకులకు బోలేడు కంటెంట్.. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ మస్త్ అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలాంటే.. బిగ్‌బాస్ ప్రారంభం అయ్యేవరకు చూడాలి.
ఇక మహాలక్ష్మి-రవీందర్‌లకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని.. దసరా సందర్భంగా వీరి విజయ్ టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. వంధాల్ మహాలక్ష్మి’ పేరుతో ఈ కార్యక్రమం దసరా సందర్భంగా విజయ్ టీవీలో ప్రసారం కానుంది. ఇక మహాలక్ష్మి-రవీందర్‌లది ప్రేమ వివాహం.. ఇద్దరికి కూడా ఇది రెండో వివాహమే. మహాలక్ష్మికి ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కొత్త జంట తమ నూతన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.