సినీ నటుడు, టీవి యాంకర్ జోగినాయుడ్ని ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు అభినందలు తెలిపారు. నిర్మాత బండ్ల గణేష్ సైతం ట్విట్టర్ ద్వారా విషెష్ తెలిపారు.
సినీ నటుడు, కమెడియన్, టీవి యాంకర్ జోగినాయుడ్ని ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి అందరికి తెలిసిందే. జోగినాయుడుకు పి కేటగిరిలో వేతనం, ఇతర అలవెన్సులు వర్తిస్తాయని జీవోలో పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం జెమినీ టీవీలో వచ్చిన జోగి బ్రదర్స్ కార్యక్రమంలో జోగినాయుడు పాపులర్ అయ్యారు. జోగి నాయుడు కీలక పదవిని స్వీకరించడంపై పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జోగినాయుడికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలిపారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ సైతం జోగి నాయుడ్ని అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం వివాదస్పద ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, చంద్రబాబు కలయికపై గణేష్ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా నటుడు జోగి నాయుడకి ఏపీ కీలక పదవి ఇవ్వడంపై బండ్ల ట్వీట్ చేశారు. జగన్ గారిని నమ్ముకున్నందుకు జోగి నాయుడుకు కూడా పదవి దక్కిందని గణేష్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అంతేకా ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటూ కూడా రాసుకొచ్చారు. జగన్ గారిని నమ్ముకున్న ఆలీ, పోసాని కృష్ణమురళికి ఇప్పటికే కీలక పదవులు వరించాయి. ఈ నేపథ్యంలోనే జోగినాయుడుకు కూడా పదవి వరించిందని బండ్ల గణేష్ రాసుకొచ్చారు.
2019లో ఎన్నికల సమయంలో వైసీపీ తరపున జోగినాయుడు ప్రచారం చేశారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న సినీ పరిశ్రమ చెందిన వ్యక్తులకు జగన్ సర్కార్ రు ఏదొక పదవి కట్టబెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జోగినాయుడుకు కూడా కీలక పదవి కట్టబెట్టింది. బండ్ల గణేష్ ట్వీట్ పై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఎంకిపెళ్లి సుబ్బుచావుకి వచ్చినట్టు.. జోగికి పదవి వస్తే.. బండ్ల గణేష్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరి. జోగి నాయుడు పదవిపై బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
జగన్ గారి ని నమ్ముకున్నందుకు జోగి నాయుడు కి కూడా పదవి ఆల్ ది బెస్ట్ తమ్ముడు 💐 @ysjagan 🙏 pic.twitter.com/H0T7pO3MiR
— BANDLA GANESH. (@ganeshbandla) February 19, 2023