తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క అలియాస్ దీప అంటే తెలియని వారు ఉండరు. కార్తీక దీపం సీరియల్ తో పాపులర్ అయిన ప్రేమీ విశ్వనాథ్ కి ఇక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీరియల్ చూసే మహిళల్లోనే కాదు, సీరియల్ వాసన చూస్తే పారిపోయే యూత్ సైతం వంటలక్క అంటే పిచ్చెక్కిపోతారు. అంత క్రేజ్ ఉంది వంటలక్క అలియాస్ దీపకి. కేరళ వాసి అయినప్పటికీ తెలుగులో ఈమె నటనతో అందరినీ ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది. అయితే కార్తీక దీపం సీరియల్ తెచ్చినంత పేరు ఇక ఏ సీరియల్ తీసుకురాలేదు. సీరియల్స్ లోనే కాకుండా పలు టీవీ షోస్ లో కూడా అలరించింది. కార్తీక దీపం సీరియల్ కి ముందు బడాయి బంగ్లా, సెల్ మి ద ఆన్సర్ వంటి టీవీ షోస్ లో పార్టిసిపేట్ చేసింది.
గోరింటాకు, చెల్లెలి కాపురం సీరియల్స్ లో అతిథి పాత్రలో మెరిసింది. తాజాగా ఈ వంటలక్క నాగచైతన్య అప్ కమింగ్ మూవీలో ఛాన్స్ పట్టేసింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న NC22 ప్రాజెక్ట్ లో ప్రేమి విశ్వనాథ్ నటిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రియమణి నటిస్తున్నట్లు ప్రకటించిన యూనిట్.. తాజాగా ప్రేమి విశ్వనాథ్ కి సంబంధించి అప్ డేట్ వదిలింది. ‘మా NC 22 ప్రాజెక్ట్ లోకి టెలివిజన్ క్వీన్, వెర్సటైల్ యాక్ట్రెస్ ప్రేమి విశ్వనాథ్ వచ్చేసింది’ అంటూ ఒక పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రంలో శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. గతంలో వంటలక్కకి సినిమా ఛాన్స్ వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. అయితే అవేమీ నిజం కాలేదు. వాటికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ కూడా లేదు. కానీ ఇప్పుడు స్వయంగా మూవీ యూనిట్ కన్ఫర్మ్ చేయడంపై వంటలక్క అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాతో వంటలక్క సినిమాల్లో అరంగేట్రం చేస్తుందని మురిసిపోతున్నారు.
Welcoming the Television Queen and Versatile Actress #PremiVishwanath on board for our #NC22 💫🔥@chay_akkineni @vp_offl @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @SS_Screens @srkathiir @rajeevan69 @abburiravi #VP11 pic.twitter.com/FrsJSeAHQQ
— Srinivasaa Silver Screen (@SS_Screens) October 14, 2022