పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆపేరు వింటేనే.. ఫ్యాన్స్‌కి పూనకాలే. ఆయన పేరు వినిపించినా.. తెర మీద కనిపించినా.. సరే.. ఊగిపోతారు. ఇక ఆయనకు కేవలం ఇండస్ట్రీలో కూడా చాలా మంది అభిమానులుంటారు. ఒక్కసారి ఆయనతో పరిచయం ఏర్పడితే.. జీవితాంతం.. ఆయన నుంచి దూరంగా ఉండలేరు.. పవర్ స్టార్ చూపించే అభిమానం ఆ రేంజ్‌లో ఉంటుంది అంటారు. ఒక్కసారి ఆయన స్నేహ హస్తం అందిస్తే.. ఇక జీవితాంతం దాన్ని కొనసాగిస్తారని అంటారు. పవన్ కళ్యాణ్ ఓ వ్యసనం.. ఒక్కసారి అలవాటు పడ్డామా.. ఇక బయట పడలేం అన్న ప్రముఖులను కూడా చూశాం. ఇక పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు.. కొందరు హీరోలు, దర్శకులకు ప్రత్యేక బహుమతలు పంపుతుంటాడు. ఆయన ఫామ్‌హౌస్‌లో పండిన మామిడి పళ్లు.. పండుగ వేళ ప్రత్యేక బహుమతులు పంపి.. సర్‌ప్రైజ్ చేస్తారు. ఇక తాజాగా టాలీవుడ్ దర్శకులకు స్పెషల్ గిఫ్ట్‌లు పంపి.. సర్ప్రైజ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఆ వివరాలు..
టాలీవుడ్ దర్శకులకు ప్రత్యేక బహుమతులు పంపి.. సర్ప్రైజ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఇంతకు బహుమతులు ఎందుకు అంటే.. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడు. తన విషెస్‌తో కూడిన మెసేజ్‌తో పాటు బహుమతులు పంపాడు. చివరన అన్నా, పవన్ కళ్యాణ్ నుంచి అని మెన్షన్ చేయడం విశేషం. ఇండస్ట్రీలో తన స్నేహితులకే కాక.. తనతో ఇటీవల పని చేసిన దర్శకులకు సైతం పవన్ ఈ బహుమతులు పంపి.. వారిని ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో పవన్ నుంచి గిఫ్ట్స్ అందుకున్న డైరెక్టర్లు.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిలో.. పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ మూవీ తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్.. ఈ ఏడాది పవన్ నుంచి క్రిస్మస్ గిఫ్ట్ అందుకున్నాడు. ఈ బహుమతులకు సంబంధించిన ఫొటోను వేణు శ్రీరామ్ భార్య తన సోషల్ ప్రొఫైల్స్‌లో పోస్ట్ చేసి.. తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రసుత్తం ఈ పోస్ట్ వైరలవుతోంది. ఇక వేణు శ్రీరామ్.. పవన్‌తో తనకు మంచి అనుబంధం ఉందని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇక ప్రతి ఏడాది పవన్.. తన ఫామ్ హౌస్‌లోని మామిడి తోటలో పండిన మామిడి పండ్లను టాలీవుడ్‌లోని మిత్రులకు, అభిమానించే వ్యక్తులకు పంపుతుంటారు. అలాగే ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా తన విషెస్ మెసేజ్‌తో కూడిన గిఫ్ట్స్ పంపి.. సర్‌ప్రైజ్ చేశారు.