తెలుగు ఇండస్ట్రీలోని అగ్రహీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఓవైపు నటుడిగా వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు జనసేన రాజకీయపార్టీ అధ్యక్షుడిగా తన పార్టీ ప్రచారాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇటీవలే ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా, భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ చేశాడు. ఇక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.
ఇటీవల జనసేన 9వ ఆవిర్భావ సభకు లక్షల సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు హాజరయ్యారు. ఇక పవన్ ప్రసంగం సమయంలో ధరించిన వేలి ఉంగరం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ పగడపు ఉంగరం ధరించడాని.. ఎవరైనా జాతకంలో దోషాలు తొలగిపోవాలని ఈ ఉంగరాన్ని ధరిస్తారని చెబుతుంటారు. వాస్తవానికి పవన్ దైవభక్తి కలవాడు.సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించే పవన్.. కుడిచేతికి ఉంగరం కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే.. కొన్ని కథనాల మేరకు పవన్ ఈ పగడపు ఉంగరాన్ని దర్శకుడు త్రివిక్రమ్ సూచనల మేరకే ధరించి ఉంటాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ అతి సన్నిహితుడిగా భావించే పవన్.. స్నేహితుడి మాటను గౌరవించి ధరించినట్లు సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి 4 క్యారెట్స్ బరువున్న ఉంగరం.. పవన్ ని అధికారంలోకి తీసుకొస్తుందేమో చూడాలని అంటున్నారు నెటిజన్లు. మరి పవన్ ఉంగరం ధరించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.