పవన్ కళ్యాణ్ గురించి ఏ మాత్రం తేడాగా మాట్లాడినా అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతారు. పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు, ఏ హీరో అభిమానులైనా ఇంతే. ఎవరైనా తమ హీరోలను అవమానిస్తే ట్రోల్ చేయడం మొదలుపెడతారు. తాజాగా హీరో విశాల్ కూడా పవన్ ఫ్యాన్స్ చేతిలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ పేరు తలిచారో లేక జెన్యూన్ గానే పవన్ పేరు తలిచారో తెలియదు గానీ పవన్ పేరు పలకడం ఇప్పుడు ఆయన సినిమా మీద ప్రభావం చూపించేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ విశాల్ ఏమన్నారంటే.. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని.. ఆయన సినిమాల్లోకి రాకముందు నుంచి తనకు తెలుసునని అన్నారు. విశాల్ తండ్రి చిరంజీవితో కలిసి ఎస్పీ పరశురామ్ సినిమా చేసినప్పుడే తాను పవన్ ని చూసినట్టు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయనకున్న క్రేజ్, యూనిక్ స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. అలాగే థియేటర్స్ లో పవన్ సినిమాలు విడుదలైతే ఒక పండగలా ఉంటుందని అన్నారు. పవన్ ని ఆకాశానికి ఎత్తేసిన తర్వాత ఏపీ సీఎం జగన్ గురించి చెప్పుకొచ్చారు. రాజకీయపరంగా జగన్ అంటే తనకు ఇష్టమని, ఏపీలో ఓటు హక్కు ఉంటే గనుక జగన్ కి ఓటు వేసేవాడినని అన్నారు. ఇదే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పిస్తుంది.
జగన్ అంటే ఇష్టం ఉన్నప్పుడు.. జగన్ ని పొగుడుకోక మధ్యలో పవన్ ని ఎందుకు లాగడం అంటూ విశాల్ పై ఫైర్ అవుతున్నారు. అసలు ఏపీలో ఓటు హక్కే లేనప్పుడు ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ లు ఇవ్వడం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరంగా పవన్ ని తక్కువ చేసి మాట్లాడారన్న కారణంగా విశాల్ పై పవన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘విశాల్ సినిమాలు థియేటర్ లో చూడడం వేరు, ఓటీటీలో చూడటం వేరు’ అని ఒక అభిమాని కామెంట్ చేశారు.
‘నాకు విశాల్ అంటే ఇష్టం, అభిమానం. కానీ సినిమా చూడాల్సి వస్తే పైరసీలోనే చూస్తాను. అభిమానం వేరు, ఆర్ధిక పరిస్థితి వేరు’ అంటూ మరొక అభిమాని కామెంట్ చేశారు. దీంతో లాఠీ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుందని కామెంట్స్ వినబడుతున్నాయి. మరి విశాల్ పై పవన్ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోల్స్ పై మీ అభిప్రాయం ఏంటి? విశాల్ తన సినిమా ప్రమోషన్ కోసమే పవన్ పేరుని వాడుకున్నారా? లేక ఆయన జెన్యూన్ గానే పవన్ పేరు ప్రస్తావించారా? పవన్ అంటే ఇష్టం, జగన్ కి ఓటు వేస్తా అనడంలో మీకు ఏమైనా తప్పు అనిపిస్తుందా? మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
PK fans : vishal movies ante istame gani OTT lo matrame chustam
— Chami Naidu (@Chami55516587) December 20, 2022
“నాకు @VishalKOfficial అంటే ఇష్టం అభిమానం
కానీ సినిమా చూడాల్సి వస్తే MovieRulz(Piracy) లోనే చూస్తాను
అభిమానం వేరు ఆర్థిక పరిస్థితి వేరు ” – #MeI like @VishalKOfficial Acting But I’ll watch his movies in MovieRulz
Because I’m financially poor and
He’s poor in Character— Eswar Babu (@EswarBabu10) December 21, 2022