వామ్మో పవన్ కళ్యాణ్ ఆ సినిమా కోసం కేవలం 15 రోజులకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారా? అంటే ఒక రోజుకి 3 కోట్లు పైమాటే. ఇది నిజంగా పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూసే.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ మల్టీస్టారర్ మూవీ లాంఛ్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకటి సినిమా టైటిల్ కాగా, మరొకటి పవన్ పారితోషికం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలు చేస్తున్నారు. తాజాగా తమిళంలో హిట్ అయిన వినోదయ సితం సినిమా రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 15 రోజులకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మామూలుగా పవన్ కి ఉన్న మార్కెట్ కి ఒక సినిమాకి రూ. 100 కోట్లు ఇస్తారనే టాక్ ఉంది. అయితే వినోదయ సితం రీమేక్ లో నటించడానికి రూ. 50 కోట్లు తీసుకుంటున్నారని టాక్. పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకి 15 రోజులే డేట్స్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఈ 15 రోజుల కోసం పవన్ కి రూ. 50 కోట్లు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన రోజుకి 3.3 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు. నువ్వు నిజంగా దేవుడు సామి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక టైటిల్ విషయంలో కూడా ఫ్యాన్స్ సంతృప్తిగా ఫీలయ్యే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ దేవుడు అని అంటూ ఉంటారు. నువ్వు మా దేవుడివి, మేము నీ భక్తులము అని అంటూ ఉంటారు. దీన్నే మేకర్స్ ఖాయం చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న వినోదయ సితం రీమేక్ కి దేవుడు అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొదట దేవర అనే టైటిల్ అనుకున్నా.. దేవుడు అనే టైటిల్ బాగుంటుందని పవన్ సూచించడంతో అదే ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్నారు. కాబట్టి ఆ టైటిల్ అయితేనే జస్టిఫికేషన్ ఉంటుందని భావించారట. మరి దేవుడు టైటిల్ పై, పవన్ పారితోషికంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.