టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి లేడీస్ లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఒక పక్క సినిమాలు, మరొక పక్క యాడ్స్ చేస్తూ టాప్ లో దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో పలు సేవా కార్యక్రమాలతో రియల్ లైఫ్‌లోనూ మహేశ్ బాబు హీరోగా దూసుకెళ్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులకు సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. ఆర్ధికంగా స్థోమత లేని కుటుంబాలకు తన సొంత ఖర్చులతో వైద్య సేవలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. అలా ఇప్పటికే మహేష్ బాబు ఎందరో చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు మహేశ్ బాబును తమ బిడ్డల పాలిట దేవుడు అంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. అందుకు నిదర్శనం తాజాగా ఓ చిన్నారి తల్లిదండ్రులు చెప్పిన మాటలు.
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్ ఆపద్భాందవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఏకంగా వెయ్యికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి గొప్ప మనసు చాటుకున్నారు. ఇలా ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను కాపాడి.. అందరి దృష్టిలో మహేశ్ బాబు గొప్ప వ్యక్తి నిలిచిపోయారు. చిన్నారుల హాస్ట్ సర్జరీల కోసం రెయిన్‌బో, ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి మహేశ్ బాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. మహేశ్ బాబు చేస్తున్న ఈ సేవ కార్యక్రమంలో ఆయన సతీమణి నమ్రత పాత్ర కూడా ప్రధానంగా ఉంది. మహేశ్ బాబు ద్వారా సాయం పొందిన ఎందరో చిన్నారుల తల్లిదండ్రులు.. తమ బిడ్డల ప్రాణాలు నిలబెట్టిన మహేశ్ బాబుకు జీవితాంతం రుణపడి ఉంటామంటూ ఎమోషన్ అవుతున్నారు.
ఇదీ చదవండి: ‘పీకే’ అంటే ఏంటంటూ నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా స్పందించిన పూనమ్ కౌర్!
ఇటీవల గుండెసమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారి మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా చికిత్స అందించారు. ఇప్పుడు ఆ బాబు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నాడు. దీంతో ఆ చిన్నారి తల్లిందండ్రుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ బాబుకు జీవితాంతం రుణపడి ఉంటామంటూ భావోద్వేగానికి గురైయ్యారు. ” మా బాబుకు గుండెలో చిన్న హోల్ ఉందని ఓ సంవత్సర క్రితం తెలిసింది. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అన్నారు. అయితే మా దగ్గర అంత డబ్బులు లేవు. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ తరపున రైయిన్ బో హాస్పిటల్ కి వచ్చాం. మాకు మహేశ్ బాబు ఫౌండేషన్ నుంచి సర్జరీ సక్సెస్ అయింది. మా చిన్నారి ప్రాణాలు నిలబెట్టిన మహేశ్ బాబు గారికి, నమ్రత గారికి ధన్యవాదాలు ” అంటూ తమ కృతజ్ఞతలను తెలియజేశారు. మరి.. చిన్నారులకు ఇంతలా సాయం చేస్తున్న మహేశ్ బాబు ఫౌండేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.