తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు వచ్చారు. వెళ్లారు. కానీ కొందరే ప్రేక్షకుల గుండెళ్లో స్థానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా ఎదిగి సినిమాలకు దూరమయ్యారు. అలాంటి ఓ నటికి ఇప్పుడు 2 వేల కోట్ల ఆస్థులున్నాయి. ఎవరా అని ఆశ్చర్యంగా ఉందా..
ఈమె ఒకప్పుడు కుర్రోళ్ల హృదయాల్ని కొల్లగొట్టిన అందాల భామ. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న కలల రాకుమారి అనతికాలంలోనే అగ్రహీరోలందరితో నటించి టాప్ హీరోయిన్‌గా మారింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్ సరసన చేసిన హిట్ సినిమాలతో ఆమె దశ మారిపోయింది. ఒకప్పుడు కాల్ షీట్లు దొరకడమే కష్టంగా మారిపోయింది. ఆ ఒక్కటీ అడక్కు సినిమా ఈమె కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పనే లేదు కదూ..ఆమె ఒకప్పటి హాట్ బ్యూటీ రంభ. పేరుకు తగ్గట్టే అందచందాలుంటాయి.
ఇప్పుడేం చేస్తోంది
కెరీర్ టాప్‌లో ఉండగానే కెనడాకు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను 2010లో పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిపోయింది. సినిమాలకు దూరమైపోయింది. ఈ అందాల భామకు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. గత కొద్దికాలంగా తిరిగి తెరపై వచ్చే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే రియాల్టీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తోంది.
రంభ భర్త బడా బిజినెస్ మెన్. హౌస్ ఇంటీరియర్ కంపెనీ మ్యాజిక్ వుడ్స్ డైరెక్టర్. ప్రస్తుతం కంపెనీలు నడుపుతున్నాడు. ఈ కంపెనీల ఆస్థుల విలువ దాదాపుగా 2 వేల కోట్లు ఉంటుందని అంచనా. సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీలంక యుద్ధ బాధిత విద్యార్ధుల కోసం విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలు స్థాపించాడు.