తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య స్టార్ హీరోలు రూట్ మారుస్తున్నారు. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలు రియాల్టీ షోల్లో హీరోలు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తెలుగు బుల్లితెరపై ‘బిగ్ బాస్’ సీజన్ 1 కి హూస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు నందమూరి కుర్రాడో ఎన్టీఆర్. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఆగష్టు 22న గ్రాండ్ గా ఈ షో ప్రారంభం అయింది. తొలి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ అతిథిగా హాజరయ్యాడు. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా కొనసాగుతోంది. తన టాకింగ్ పవర్ తో కంటెస్టెంట్స్ ని, ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ఈ షో ద్వారా మరింత వినోదం పంచేందుకు రెడీ అయిపోయారు. ఈ షోకి మొదటి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. మద్యలో కాస్త గ్యాప్ తీసుకొని మరింత వినోదం పంచేందుకు ఇద్దరు టాప్ దర్శకులను హాట్ సీట్లో కూర్చోబెట్టాడు తారక్. ఇంతకీ ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఎవరా అనుకుంటున్నారా.. రాజమౌళి, కొరటాల. ఈ ఇద్దరు దర్శకులు హాట్ సీట్లో కూర్చొని.. రోల్ కెమెరా, యాక్షన్ అంటూ ఎన్టీఆర్ పై కమాండ్ చేయబోగా.. ‘ఈ షో నాది.. లోకేషన్ నాది, డైరెక్షన్ నాది.. ఇక్కడ నేనే బాస్’ అంటూ దర్శకులిద్దరికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఎన్టీఆర్.
ఇక వీరిద్దరితో ఉన్న చనువుకి తనదైన వాక్చాతుర్యం తోడవ్వడంతో ఆట రసవత్తరంగా సాగింది. ఎన్టీఆర్ వేసిన ప్రశ్నకు ఈ ఇద్దరు డైరెక్టర్లు డిస్కర్షన్ చేసుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ వారిపై సీరియస్ అయ్యాడు. షూటింగ్ లో ఏలాగూ నేను లెక్కలేదు.. అనగానే వెంటనే రాజమౌళి స్పందించి మీరే చెప్పారు కదా.. ఇద్దరూ డిస్కర్షన్ చేసుకోవొచ్చు అన్నాడు. దానికి బదులుగా ఎన్టీఆర్ ఆఫ్షన్ ఫిక్స్ చేసిన తర్వాత ఎలా డిస్కర్షన్ చేసుకుంటారు అని సీరియస్ అయ్యాడు.. దాంతో రాజమౌళి ముందు మాట్లాడకూడదు అంటారు.. తర్వాత మాట్లాడకూడదూ అంటారు.. హాస్టల్ పిల్లల్లా చూస్తున్నారు అన్నాడు. అప్పుడు ముందు మాట్లాడుకోవొచ్చు.. ఆప్షన్ ఫిక్స్ చేసిన తర్వాత నో ఛాన్స్ అంటూ ఎన్టీఆర్.. ఇక్కడ లోకేషన్ నాది, డైరెక్షన్ నాది… ఇక్కడ నేనే బాస్’ అంటూ కామెడీ చేస్తూనే సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా ఈ ముగ్గురు స్టార్స్ తో చాల ఫన్నీగా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.