టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ దగ్గుబాటి వెంకటేష్ - రానాలకు ఓటిటి సమయం ఆసన్నమైందని చెప్పాలి. వీరిద్దరూ ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ డ్రామా సిరీస్ 'రానా నాయుడు'. నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించిన ఈ సిరీస్ హాలీవుడ్ 'రే డొనోవన్' సిరీస్ కి అఫిషియల్ రీమేక్ గా రూపొందింది.
ఓటిటి ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక యంగ్ స్టర్స్ నుండి స్టార్స్ వరకు వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్రెడీ సూపర్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్స్ అందరూ ఓటిటి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసి వారి అదృష్టాలను పరీక్షించుకున్నారు. కాగా.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ దగ్గుబాటి వెంకటేష్ – రానాలకు ఓటిటి సమయం ఆసన్నమైందని చెప్పాలి. వీరిద్దరూ ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ డ్రామా సిరీస్ ‘రానా నాయుడు’. నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించిన ఈ సిరీస్ హాలీవుడ్ ‘రే డొనోవన్’ సిరీస్ కి అఫిషియల్ రీమేక్ గా రూపొందింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్ నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ ని సుపర్ణ వర్మ, కరణ్ అన్షుమన్ తెరకెక్కించారు.
ట్రైలర్ చూస్తుంటే.. వెంకీ, రానాలతో పాటు సుర్వీన్ చావ్లా కీలకపాత్రలలో కనిపిస్తున్నారు. కాగా, ఈ సిరీస్ స్టోరీ అంతా తండ్రీకొడుకుల మధ్య జరుగుతుంది. ఎన్నో ఎమోషన్స్, కోపతాపాల మధ్య ఉత్కంఠ భరితంగా రానా నాయుడు ట్రైలర్ ని కట్ చేశారు. అయితే.. రానా ఎప్పటిలాగే సూట్ బూట్ లో స్టైలిష్ గా కనిపిస్తూనే.. యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టాడు. ఇందులో నాగ నాయుడుగా నటించిన వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాస్త వయసు పైబడిన లుక్ లో వెంకీ.. ఎమోషన్స్ తో పాటు అంతే బోల్డ్ గా కూడా మెప్పించాడు. అన్ని ట్విస్ట్ ల మధ్య రానా – వెంకీలతో చివరి ట్విస్ట్ బాగుంది. ఇందులో డైలాగ్స్ కొంచం నెట్ ఫ్లిక్స్ లెవెల్ కి తగ్గకుండా బూతులు కూడా కానిచ్చేశారు. చూడాలి.. మార్చి 10 నుండి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. మరి రానా నాయుడు ట్రైలర్ మీకెలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి.