పవన్- రానా కాంబోలో తెరకెక్కిన పవర్ ప్యాక్ భీమ్లానాయక్ విడుదలై.. అభిమానుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. భీమ్లానాయక్ చిత్ర బృందానికి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా భీమ్లానాయక్ సినిమాపై స్పందించారు. సినిమా గురించి మంచి టాక్ వినిపిస్తోంది. త్వరలోనే చూడాలి అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.
‘భీమ్లానాయక్ సినిమా గురించి చాలా మంది స్పందన వస్తోంది. సినిమా చూడాలని అనుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రతి రంగాన్ని నాశనం చేయాలని సీఎం వైఎస్ జగన్ చూస్తున్నారు. అందుకు సినిమా రంగం కూడా అతీతమేమీ కాదు. అడ్డంకులను అధిగమించి భీమ్లానాయక్ మంచి విజయాన్ని అందుకుంటుందని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
Hearing tremendous response for #BheemlaNayak. Looking forward to watching it. @ysjagan wants to transform AP into a begging bowl by finishing off one industry after another, movie industry being no exception. I wish #BheemlaNayak overcomes all conspiracies to come out triumphant pic.twitter.com/cqn636HsCU
— Lokesh Nara (@naralokesh) February 25, 2022