Nandamuri Taraka Ratna: ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండి తెర ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నట వారసులుగా వారి కుమారులు హరికృష్ణ, బాలక్రిష్ణలతో పాటు కొంతమంది మనవళ్లు కూడా సినీ రంగంలోకి వచ్చారు. వారిలో నందమూరి తారకరత్న ఒకరు. మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా 2002లో తన కెరీర్‌ను ప్రారంభించిన తారకరత్న ఇప్పటివరకు దాదాపుగా 23 సినిమాల్లో నటించారు. ప్రతీ సినిమాలో నటన పరంగా మెప్పించిన ఆయన.. కమర్శియల్ సక్సెస్ అందుకోవటంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు.
కానీ, ఆయన విలన్‌గా నటించిన ‘అమరావతి’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో తారకరత్న నటకు గానూ నంది అవార్డు సొంతం అయింది. అయితే, గత కొంతకాలంగా తారకరత్న సినిమా విషయంలో కాస్త స్లో అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తారకరత్న ‘9 అవర్స్’ అనే ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా, ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తారకరత్న.. బాబాయ్ బాలక్రిష్ణ, తమ్ముడు ఎన్టీఆర్‌ల నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ నటన విషయంలో బాలకృష్ణ బాబాయ్, తమ్ముడు ఎన్టీఆర్ తో నేను పోల్చుకోను. వారిలా చేయాలని ఎప్పుడూ అనుకోను. నా స్టయిల్లో నేను నటిస్తా.
డైరెక్టర్ నా నుంచి ఏమి ఆశిస్తారో ఆ మేరకు నేను నటిస్తా. డైరెక్టర్ కు ఏం కావాలో అది నాతో చేయించుకుంటారు. ఎలాంటి పాత్రలను పోషించడానికైనా నేను సిద్ధం. ప్రతి క్యారెక్టర్ ని నేను ఇష్టపడతా. డైరెక్టర్ వల్లే నేను గతంలో నంది అవార్డును గెలుచుకున్నా. ఒక సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ విజయవంతం కావాలంటే స్క్రిప్ట్ చాలా ముఖ్యం’’ అని అన్నారు. కాగా, జూ. ఎన్టీఆర్‌ను తారకరత్న తమ్ముడు అంటూ పిలవటంపై జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబం మొత్తం ఎప్పటికీ ఒక్కటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, తారకరత్న చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Karan Johar: కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో తళుక్కుమన్న తారలు.. వీడియో వైరల్!