సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల మంచి మనసు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎందరో వేలమంది పిల్లలను గుండె సంబంధిత వ్యాధుల బారినుండి కాపాడిన మహేష్, నమ్రత.. తాజాగా ఓ పేద విద్యార్ధి చదువుకోవడానికి ఆర్థికంగా సాయం చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఓవైపు ఫ్యామిలీ, పిల్లలను చూసుకుంటూనే.. మరోవైపు ఇలా సేవా కార్యక్రమాలు చేపడుతూ.. లక్షలమంది హృదయాలను గెలుచుకుంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల మంచి మనసు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎందరో వేలమంది పిల్లలను గుండె సంబంధిత వ్యాధుల బారినుండి కాపాడిన మహేష్, నమ్రత.. తాజాగా ఓ పేద విద్యార్ధి చదువుకోవడానికి ఆర్థికంగా సాయం చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. మహేష్ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీస్ చేయిస్తున్న మహేష్ అడుగు జాడల్లోనే ఎంతో సేవాదృక్పథంతో నడుస్తోంది నమ్రత. ఓవైపు ఫ్యామిలీ, పిల్లలను చూసుకుంటూనే.. మరోవైపు ఇలా సేవా కార్యక్రమాలు చేపడుతూ.. లక్షలమంది హృదయాలను గెలుచుకుంటున్నారు.
ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఓ విద్యార్ధికి ల్యాప్ టాప్ ని అందజేసింది నమ్రత. ఓవియేషన్ కోర్స్ చదువుకుంటున్న విద్యార్థిని ఫ్యూచర్ స్టడీస్ కి కూడా తాను ఆర్థికంగా సహకరించేందుకు సిద్ధమేనని నమ్రత తెలిపారు. దీంతో.. నమ్రత చేతుల మీదగా ల్యాప్ టాప్ అందుకున్న ఆ విద్యార్థిని.. నమ్రత, మహేష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం నమ్రత ఆ పేద విద్యార్థికి ల్యాప్ టాప్ అందజేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేవిధంగా ఆ విద్యార్ధి తండ్రి కూడా మహేశ్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక ఈ వీడియోని ఫిల్మ్స్ పీఆర్ అండ్ మార్కెటింగ్ కన్సల్టెంట్ వంశీ శేఖర్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఇక మహేష్, నమ్రత దంపతులు మరోసారి ఇలా పేద విద్యార్థికి సాయం చేస్తూ కనిపించేసరికి మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా.. నెటిజన్స్ స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రెజెంట్ మహేష్ సినిమాల విషయానికి వస్తే.. దర్శకుడు త్రివిక్రమ్ తో ‘SSMB28’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అనంతరం మహేష్.. దర్శకధీరుడు రాజమౌళితో నెక్స్ట్ మూవీ చేయనున్నాడు. ఆ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా హీరోగా అవతరించనున్నాడు. మరి మహేష్ – నమ్రత దంపతుల గొప్ప మనసు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
On this #InternationalWomensDay2023, #NamrataMaheshGhattamaneni & @urstrulyMahesh sponsored laptop and educational support for a bright Aviation student through @MBfoundationorg. ❤️ #IWD2023 #WomensDay #MaheshBabu pic.twitter.com/hMqulMbiWw
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 8, 2023
