సాధారణంగా ఏ రంగంలోనైనా ఇద్దరి వ్యక్తుల మధ్య వార్ అనేది మామూలే. సినీ రంగంలో.. ముఖ్యంగా రాజకీయ రంగంలో వార్ రెగ్యులర్ గా కనిపిస్తుంది. పాలిటిక్స్ లో పార్టీల పరంగా విమర్శలు.. పోటీ పరంగా కామెంట్స్ చేసుకోవడం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో ఇటు మెగా ఫ్యామిలీ, అటు మంత్రి రోజా పేర్లు ఎక్కువగా వినిపించాయి. మెగా బ్రదర్స్ పై రోజా కామెంట్స్ చేయడం.. ఆమెపై మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవ్వడం.. ఇలా ఓ వార్ లా జరుగుతూ వచ్చింది. అయితే.. మంత్రి రోజా జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్, మెగాబ్రదర్ నాగబాబులపై కామెంట్స్ చేస్తూనే.. మెగాస్టార్ చిరంజీవిపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
రోజా విమర్శలపై అటు మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోజా విమర్శలపై పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. కానీ.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం జస్ట్ విమర్శించేవాళ్ళు ఉంటూనే ఉంటారని చెబుతూ లైట్ తీసుకున్నారు. తాను పెద్దగా స్పందించాలని అనుకోకుండా.. కేవలం తన పని తాను చేసుకుంటూ వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. దీంతో రోజా ఇప్పటికైనా మెగా ఫ్యామిలీపై విమర్శలు మానుకుంటే మంచిదని అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. రోజా ఎన్ని మాటలు అన్నా.. చిరంజీవి ఆమెను ఒక్కమాట కూడా అనకుండా తన సంస్కారాన్ని చాటుకున్నారని అంటున్నారు.
ఈ క్రమంలో రోజా కామెంట్స్ పై మెగా బ్రదర్ నాగబాబు సుమన్ టీవీ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. రోజా కామెంట్స్ గురించి నాగబాబు మాట్లాడుతూ.. “అన్నయ్య ఎవరికీ చెడు చేసే వ్యక్తి కాదు. అయినా విమర్శిస్తూనే ఉంటారు. ఆయన నుండి ఏదైనా తప్పు జరిగిందంటే నేను కూడా మౌనం వహిస్తాను. కానీ.. ఆయన రెగ్యులర్ గా కోట్లరూపాయలు దానం చేస్తుంటారు. ఆయనే అన్నారు రోజా లాంటివారి కామెంట్స్ కి రియాక్ట్ అవ్వడం కంటే.. తనని తాను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తానని.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు రాళ్లు తగులుతుంటాయి. విమర్శించేవాళ్ళు కూడా అంతే. రాళ్ల లాంటి వాళ్లే.. వాళ్ళని ఏమని తిడతాం” అన్నారు. ప్రస్తుతం నాగబాబు మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి నాగబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.