మన దేశంలో రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. సినిమాల్లో రాణించిన చాలా మంది ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పాలు పంచుకున్నారు. వీరిలో సీనియర్ ఎన్టీఆర్ అయితే ఏకంగా తెలుగు దేశం పార్టీ స్థాపించి.. ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అటు తమిళనాడులో కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారే ఏళ్ల తరబడి సీఎం పదవిలో ఉన్నారు. ఇప్పటికి కూడా మన రాజకీయాల్లో ఇండస్ట్రీకి చెందిన పలువురు ఎమ్మెల్యే, ఎంపీలుగా రాణిస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సినీ ప్రముఖులందరు సక్సెస్ అవుతారా అంటే లేదు. చాలామందికి పాలిటిక్స్ సెట్ కావు. తాను కూడా ఈ కోవలోకే వస్తాను అన్నాడు సినీ నటుడు, తెలుగు దేశం సభ్యుడు మురళీ మోహన్. తాజాగా సుమన్‌టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఏదైనా ఉంటే.. అది రాజకీయాల్లోకి రావడం అని లెంపలేసుకున్నారు. అన్న ఎన్టీఆర్ అడిగినా రాజకీయాల్లోకి వెళ్లని మురళీమోహన్ చంద్రబాబు నాయుడి మాటలకు మనసు మార్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పాలిటిక్స్‌లో ఉన్న పదేళ్లలో చాలా కోల్పోయానంటూ బాధపడ్డారు. ఇక టీడీపీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మురళీ మోహన్.. తొలిసారి చంద్రబాబు చేసిన తప్పిదాల గురించి మాట్లాడారు.
ఉద్యోగస్తుల విషయలో చంద్రబాబు తీరు సరికాదని.. ఆయన ఉద్దేశం మంచిదే అయినా.. అది రాంగ్ రూట్‌లో వెళ్లింది అన్నారు. చంద్రబాబు చేసిన తప్పిదాల్లో అతి పెద్దది కేసీఆర్‌కి మంత్రి పదవి ఇవ్వకపోవడమే అని తెలిపారు. ఆరోజు చంద్రబాబు కేసీఆర్‌ని నిర్లక్ష్యం చేయకుండా ఆ మంత్రి పదవి కేసీఆర్‌కి ఇచ్చి ఉంటే.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజనే ఉండేది కాదు. ఇది ఖచ్చితంగా తప్పే అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
