పాన్ ఇండియా కల్చర్ టాలీవుడ్ ని మరోస్థాయిలో నిలబెట్టింది. ఇక మన హీరోలను అయితే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసింది. దీంతో క్రేజ్ దృష్ట్యా.. మన వాళ్లు.. బాలీవుడ్ హీరోలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. ‘బాహుబలి’తోపాటు ప్రభాస్, ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్.. వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక సినిమాలకు సంబంధించిన బాక్సాఫీస్ విశ్లేషణలు, రేటింగ్స్ ఇచ్చే ఓర్ మ్యాక్స్ తాజాగా హీరో, హీరోయిన్స్, సినిమాలపై సర్వే చేసి ఫలితాలు విడుదల చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత కొన్నాళ్ల నుంచి దక్షిణాది సినిమాలో ఉత్తరాదిలోనూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఆయా చిత్రాల్లోని హీరోలకు కూడా అక్కడ చాలామంది అభిమానులవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఓర్ మ్యాక్స్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ సర్వే నిర్వహించింది. ఇందులో అందరూ దక్షిణాది హీరోలే నిలవడం విశేషం. అగ్రస్థానంలో తలపతి విజయ్ ఉండగా ఆ తర్వాత ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, యష్, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, మహేశ్ బాబు, సూర్య, అజిత్ వరసగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు ఆల్ ఇండియా లెవల్లో సేకరించిన గణాంకాలతో ఈ జాబితాని విడుదల చేశారు.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Aug 2022) #OrmaxSIL pic.twitter.com/LxkrUwE85g
— Ormax Media (@OrmaxMedia) September 20, 2022
కేవలం తెలుగు వరకు మాత్రమే చూసుకుంటే ప్రభాస్ టాప్ ప్లేస్ దక్కించున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో ఎన్టీఆర్,అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ టాప్-10లో ముద్దుగుమ్మ సమంత టాప్ ప్లేస్ దక్కించుకుంది. మిగిలిన వారిలో వరసగా ఆలియా భట్, నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొణె, రష్మిక, కీర్తి సురేశ్, కత్రినా కైఫ్, పూజాహెగ్డే, అనుష్క శెట్టి ఉన్నారు. మోస్ట్ అవైటెడ్ తెలుగు ఫిల్మ్స్ జాబితాలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’.. ప్రభాస్ ‘సలార్’, ‘ఆదిపురుష్’.. పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’.. విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ఉన్నాయి.
Ormax Stars India Loves: Most popular female film stars in India (Aug 2022) #OrmaxSIL pic.twitter.com/8TW95nNnjN
— Ormax Media (@OrmaxMedia) September 20, 2022
ఇదీ చదవండి: కశ్మీర్ లో ప్రదర్శితమవుతున్న తొలి సినిమాగా RRR చరిత్ర!