తెలుగు ప్రేక్షకులకు అందరివాడు, ఆపద ఉన్నవారికి ఆపద్బాంధవుడు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఎందరికి స్ఫూర్తిగా నిలిచారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం మెగాస్టార్ ది. ఆయన రీల్ హీరోనే కాక రీయల్ హీరో కూడా.. సామాజికి సేవ కార్యక్రమాలోనూ ఎల్లప్పుడు మెగాస్టార్ ముందుంటారు. ఇక అభిమానుల విషయంలో చిరంజీవి చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రెండు కిడ్నీలు పాడై పోయి బాధపడుతున్న ఓ అభిమాని చివరి కోర్కె చిరంజీవి తీర్చారు. వివరాల్లోకి వెళ్తే..
మెగాస్టార్ సొంతూరు అయిన మొగల్తూరు చెందిన నాగరాజు అనే ఓ మెగా అభిమానికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈక్రమంలో తన చివరి కోర్కెగా తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని కలవాలనుందని మనసులో మాట బయటపెట్టాడు.ఈ విషయం అటూ ఇటూ వెళ్లి చివరికి మెగాస్టార్ కి చేరింది. దీంతో చిరంజీవి నాగరాజు కుటుంబాన్ని తన నివాసానికి ఆహ్వానించారు. మృత్యువుతో పోరాడుతున్న తన అభిమాని నాగరాజును చూసి చిరంజీవి మనస్సు చలించింది. నాగరాజును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పరామర్శించారు.
దాదాపు గంటపాటు ఆ అభిమానితో చిరంజీవి ముచ్చటించారు. అతడిలో మానసిక స్థైర్యం కలిగించారు. అంతే కాక ఆర్థికసాయం కూడా నాగరాజు అందించారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు మనస్సున మహారాజు మా అన్నయ్య చిరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A fan named Nagaraju from his native village (Mogalthur) was fighting for his life with two kidney failure’s and wanted to meet #Megastar @KChiruTweets garu as his last wish.
Boss met Nagaraju and discussed with him for an hour and provided financial help and mental Support ❤️ pic.twitter.com/gKnQsS8koP
— SivaCherry (@sivacherry9) August 8, 2022