చిరంజీవి.. ఈ ఒక్క పేరు చాలు తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ని ఊచకోత కొయ్యడానికి. చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులకి పండుగరోజు..తాజాగా కొన్ని రోజుల నుంచి చిరంజీవి ఆరోగ్యానికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతు వస్తుంది.
చిరంజీవి.. ఈ ఒక్క పేరు చాలు తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ని ఊచకోత కొయ్యడానికి. చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులకి పండుగరోజు..తాజాగా కొన్ని రోజుల నుంచి చిరంజీవి ఆరోగ్యానికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతు వస్తుంది. సోషల్ మీడియా లో ఆ న్యూస్ చూసిన ఎంతోమంది చిరంజీవి అభిమానులు తమ అన్నయ్య మెగాస్టార్ కి ఏమైందంటూ ఆందోళన చెందుతు ఉన్నారు.
చిరంజీవి లేటెస్టుగావచ్చిన తన భోళాశంకర్ మూవీ తో తన అభిమానుల్ని,ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే. ఆ మూవీలో డాన్సులు గాని ఫైట్ లు గాని చిరంజీవి ఇరగదీసాడు. గత కొన్ని రోజుల నుంచి చిరంజీవి హైదరాబాద్ లో లేరని ఆయనకి మోకాలికి సంబంధించిన శస్త్ర చికిత్స జరుగుతుందని ఆ చికిత్స ఢిల్లీ లో అని కొంత మంది కాదు బెంగళూరులో జరుగుతుంది అని కొంత మంది చెప్తున్న వార్తలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో చిరంజీవి అభిమానులు చిరంజీవికి శస్త్ర చికిత్స ఏంటి అసలు ఏమైంది అని ఆందోళన చెందుతున్నారు.
చిరంజీవి అభిమానుల ఆందోళనని అర్ధం చేసుకున్న చిరంజీవి బృందం వారు చిరంజీవి హెల్త్ గురించి వస్తున్న వార్తల విషయం లో పూర్తి క్లారిటీ ని ఇచ్చారు. చిరంజీవి గారికి తరచుగా ఒక మోకాలిలో నొప్పి వస్తుంటే ఆ నొప్పికి శాశ్వత పరిష్కారం కోసం నీ వాష్ అనే చిన్న (knee wash surgery) ఆపరేషన్ జరిగిందని ఎలాంటి కోత లేకుండానే ఆర్థ్రోస్కోపిక్ విధానంలో మోకాలినొప్పిని తొలగించారని చెప్పారు.ఈ ఆపరేషన్ ఢిల్లీ లో జరిగిందని కూడా వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం చిరంజీవి గారు ఢిల్లీ లోనే రెస్ట్ తీసుకుంటున్నారని వారం రోజుల తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వస్తారని చిరంజీవి పీఆర్ బృందం తెలిపింది.తమ అభిమాన కధానాయకుడు త్వరగా కోలుకొని తిరిగి రావాలని చిరంజీవి అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ కోరికని వెల్లడిస్తున్నారు.