మెగాస్టార్ చిరంజీవి.. కొన్ని పదుల మంది హీరోలకి ఆయన ఇన్స్పిరేషన్. కొన్ని వందల మంది సినిమా టెక్నీషియన్స్ కి ఆయనే ఒక ఎనర్జీ. కోట్ల మంది ప్రేక్షకులకి ఆయన ఆరాధ్య దైవం. ఇది ఇండస్ట్రీ మెగాస్టార్ స్టామినా. అయితే.., ప్రస్తుతం చిరంజీవి 6 పదుల వయసులోకి వచ్చేశారు. మాములుగా అయితే వయసు పెరిగే కొద్దీ ఎవరిలో అయినా ఎనర్జీ తగ్గిపోద్ది. కానీ.., చిరంజీవి మాత్రం తగ్గదే లే అన్నట్టు.. వరుసగా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. ఇదే సమయంలో మిగతా హీరోల సినిమా ప్రమోషన్స్ లో కూడా యాక్టీవ్ గా పాల్గొంటున్నారు. అయితే.., ఇవన్నీ ప్రొఫెషన్ కాబట్టి, తప్పదు కాబట్టి మెగాస్టార్ ఇంత ఎనర్జీగా ఉంటున్నారు అనుకుంటే పొరపాటే. రియల్ లైఫ్ లో కూడా మెగాస్టార్ జోష్ లో ఏ మాత్రం మార్పు రాలేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్ ఓ వీడియో ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
చిరంజీవి తాజాగా ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యారు. చాలా క్లోజ్ సర్కిల్ పీపుల్ కి మాత్రమే ఈ పార్టీకి ఇన్విటేషన్ అందినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో ఓ హై క్లాస్ లేడీతో చిరంజీవి అదిరిపోయే స్టెప్పులు వేశారు. క్లాస్ ప్లస్ మాస్ మిక్స్ అన్న రీతిలో ఉన్న ఈ స్టెప్స్ చూస్తుంటే ఆయన ఎనర్జీ లోనే కాదు స్టైల్ లో కూడా ఏమాత్రం మార్పు రాలేదని విషయం అర్ధం అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ దీనిపై స్పందిస్తున్నారు.
రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కాదు బాస్ డ్యాన్స్ లో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి నటించిన ఆచార్య మూవీ త్వరలోనే విడుదల కావాల్సి ఉంది. మరి.. ఈ వయసులో కూడా డ్యాన్స్ లో దుమ్ము రేపేస్తున్న మెగా బాస్ ఎనర్జీ సీక్రెట్ ఏమిటో? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.
Bossssuuu @KChiruTweets 😄🔥 pic.twitter.com/I2cOef0m78
— Pawanfied (@OnlyPSPK_) September 20, 2021