టాలీవుడ్ సీనియర్ నటి పాకీజా దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్రదర్ నాగబాబు చెరో లక్ష రూపాయాలు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాకీజాకు చేయూత అందించాడు మా అధ్యక్షుడు మంచు విష్ణు.
సినిమా ఇండస్ట్రీలో అందరి నటీ, నటుల జీవితాలు ఒకే విధంగా ఉండవు. ఇక హీరోలు, హీరోయిన్స్ ఇతర స్టార్ నటీ, నటుల జీవితాలు ఎలాగున్నా.. క్యారెక్టర్ ఆర్టిస్టుల, జూనియర్ ఆర్టిస్టుల జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. గతంలో ఓ వెలుగు వెలిగిన చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఇప్పుడు అధ్వాన్న స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటి పాకీజా దీన స్థితిని ప్రపంచానికి చూపెట్టింది సుమన్ టీవీ. దాంతో ఆమె పరిస్థితికి చెలించిన చాలా మంది నటులు తమ చేతనైన సాయం చేశారు. ఇక పాకీజా స్థితి చూసిన మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు సాయం చేసి మరోసారి తన దానగుణాన్ని చాటుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం లక్ష సాయం చేసి మంచి మనసును చాటిచెప్పారు. తాజాగా పాకీజాకు సాయం చేశాడు టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు. ఆ వివరాల్లోకి వెళితే..
నటి పాకీజా.. అసెంబ్లీ రౌడీ సినిమాలో బ్రహ్మనందంతో కలిసి చేసిన కామెడీకి నవ్వని ప్రేక్షకులు ఉండరు. అంతలా ఆమె ఆ పాత్రలో జీవించారు. చాలా సినిమాల్లో ఆర్టిస్ట్ గా నటించిన ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా ఉంది. ఇక పాకీజా దయనీయ స్థితిని ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది ప్రముఖ ఛానల్ సుమన్ టీవీ. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆమెకు చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కష్టం అంటే ముందుండే మెగా ఫ్యామిలీ మెుదట పాకీజాను ఆదుకుంది.. తొలుత మెగా బ్రదర్ నాగబాబు లక్ష రూపాయలు అందించి మంచి మనసు చాటుకున్నారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి సైతం పాకీజాకి లక్షరూపాయలు అందించి మరోసారి తన దానగుణం చాటుకున్నారు.
ఇక సుమన్ టీవీ ఇంటర్వ్యూ ద్వారా పాకీజా కష్టాల్లో ఉందని తెలుసుకున్న మోహన్ బాబు.. స్వయంగా పాకీజాతో ఫోన్ లో మాట్లాడారు. తాను అమెరికాలో ఉన్నానని ఇండియా రాగానే సాయం చేస్తానని మాట ఇచ్చినట్లుగా పాకీజా చెప్పుకొచ్చింది. అయితే పాకీజీకి సాయం చేసి.. తన మంచి మనసును చాటుకున్నాడు మంచు విష్ణు. ఇంతకీ ఆ సాయం ఏంటంటే? మంచు విష్ణు తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డ్ పాకీజాకి అందించనున్నాడు. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెళ్లడించింది. మా అసోసియేషన్ కార్డుకు గతంలో రూ. లక్ష రూపాయలు ఉండేది. కానీ ప్రస్తుతం దానిని రూ. 90 వేలకు తగ్గించారు. వీకే నరేష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 90 వేలకు తగ్గించాడు. ఇప్పుడు ఈ అసోసియేషన్ కు కట్టాల్సిన 90 వేల రూపాయలను మంచు విష్ణు చెల్లించి, ఆమెకు కార్డు ఇస్తాడు అని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కుటుంబానికి మా అసోసియేషన్ ద్వారా లభించే అన్ని సౌకర్యాలకు ఆమె అర్హురాలు అవుతుంది. మరి సొంత డబ్బులతో పాకీజాకి మా అసోసియేషన్ కార్డు అందిస్తున్న మంచు విష్ణుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.