శుక్రవాం మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల వివాహం ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే పెళ్లి అనంతరం మంచు మనోజ్ తొలిసారి మీడియా మందు మాట్లాడాడు. తనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మంచు వారి కుటుంబ సభ్యులు, భూమ కుటుంబ సభ్యుల సమక్షంలో.. అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. ఇక అన్ని పుకార్లకు చెక్ పెడుతూ.. మోహన్‌బాబు దగ్గరుండి కుమారుడు మనోజ్ వివాహం జరిపించాడు. మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహం జరిగింది. తమ్ముడి పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లను మంచు లక్ష్మి దగ్గరుండి మరీ చూసుకుంది. పలువురు సినీ ప్రముఖులు పెళ్లికి హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. మంచు మనోజ్ పెళ్లి తరువాత మొదటి సారి మీడియా ముందు మాట్లాడారు. ఈ క్రమంలో మనోజ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నూతన దంపతులు మంచు మనోజ్, భూమ మౌనిక రెడ్డి కర్నూలు వెళ్లారు. అయితే ఈ నవ దంపతులకు కర్నూలు ఎంట్రన్స్ లో పూలూరు టోల్ ప్లాజా వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ కాన్వాయ్ తో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇంటికి మంచు మనోజ్ దంపతులు వెళ్లారు. నూతన వధువరులు ఎస్వీ మోహన్ రెడ్డి దంపతుల నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి.. భూమా మౌనికా రెడ్డికి మేనమామ అనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే తన మేనమామ ఆశీస్సుల కోసం భూమ మౌనికా రెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు. ఈ కొత్త జంటకు ఎస్వీ మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. వివిధ రకాల వంటకాలతో ఆతిథ్యం ఇచ్చారు.
అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అపూర్వమైన స్వాగతాన్ని ఈ జన్మలో మర్చిపోలేనని మంచు మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ” అందరికి నమష్కారం,.. మీ ఆశీస్సులతో భూమా మౌనికతో పెళ్లైంది. అలానే పెళ్లి తరువాత మా మోహన్ బాబాయ్ ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. మోహన్ బాబాయ్ మాకు అద్భుతమైన ఆతిథ్యం అందించారు. రాయసీమ స్టైల్ లో రుచికరమైన వంటకాలతో దుమ్ములేపారు. అంతేకాక ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలానే ఇంకా నంద్యాల, ఆళ్లగడ్డ, కడప, తిరుపతికి వెళ్లనున్నాము.
దారి పొడవునా మా ఆత్మీయులను కలుసుకుంటూ, వారి ఆశీర్వదాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాము. అలానే అందరి ఆశీస్సులు, సపోర్టు ఎప్పుడూ ఉంటుందని, ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను” అని మంచు మనోజ్ అన్నారు. అలానే అభిమానుల ఘన స్వాగతం పలకడంపై మీకు ఏమనిపిస్తుందని మీడియా ప్రశ్నించగా.. అది దేవుడు ఇచ్చిన వరమని, అది మాటలతో చెప్పలేమని, అది అనుభవించాల్సిందే అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మరి..మంచు మనోజ్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.