సాధారణంగా సినిమా ఈవెంట్స్ లో, అవార్డు ఫంక్షన్స్ లో సెలబ్రిటీలు స్టేజిపై డాన్స్ చేస్తే చూసే ప్రేక్షకులకు సరదాగా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ స్టేజిపై డాన్స్ చేస్తే చూడటం అభిమానులకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఈ విషయంలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ఫ్యాన్స్ ని ఎప్పుడూ నిరాశపరచదని తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో ప్రూవ్ చేసింది. తెలుగులో వరుస హిట్స్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్న రష్మిక.. గతేడాది పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగు మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు సొంతం చేసుకుంది.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న రష్మిక.. యంగ్ హీరోయిన్ కృతిశెట్టితో కలిసి స్టేజిపై డాన్స్ చేసింది. పుష్ప మూవీలో సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో ‘సామీ సామీ’ సాంగ్ ఇంకా పాపులర్ అయ్యింది. ఆ పాటలో రష్మిక గ్లామర్ ట్రీట్ కూడా మామూలుగా ఉండదు. ఇప్పుడీ ఫంక్షన్ లో కూడా రష్మిక గ్లామర్ గానే రెడీ అయ్యి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ అవార్డు తీసుకున్న అనంతరం రష్మికను స్టేజి పైకి పిలిచాడు. ఆ తర్వాత స్టేజిపైనే ఉన్న కృతిశెట్టి.. రష్మికతో కలిసి సామీ సామీ పాటకు స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగవైరల్ అవుతోంది.