పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అన్ని కూడా సినిమా పై భారీ అంచనాలు సెట్ చేశాయి. అయితే.. సినిమా రిలీజ్ కాకముందే భీమ్లా నాయక్ పాటతో పద్మశ్రీ అందుకున్నారు కిన్నెర మొగులయ్య.
పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగులయ్య.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అవుసలికుంట గ్రామంలో నివాసముంటారు. 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరి తరం కళాకారుడు మొగులయ్య. అత్యంత వైభవమైన కిన్నెరమెట్ల కళను గుర్తించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఇక మొగులయ్య పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘పవన్ సార్ ని కలవాలని పోతే ఆ కర్రె బట్టలోళ్లు ఆపి.. ఆయన లేడని చెప్పినారు. త్వరలోనే సార్ ని కలుస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మొగులయ్య మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.