ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కాంతారా సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది. కాంతారా ఛాప్టర్ 1గా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన కాంతారా ఛాప్టర్ 1 విడుదలకు ముందే హోరెత్తిస్తోంది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2022 ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన కాంతారా దాదాపు అన్ని భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా 400 కోట్లు దాటి వసూళ్లు చేసింది. రిషబ్ శెట్టి నటనను అంతా పెద్దఎత్తున ప్రశంసించారు. కాంతారా సూపర్ హిట్ అవడంతో సహజంగానే కాంతారా ఛాప్టర్ 1పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా నైజాంలో 40 కోట్లు, కోస్తాంధ్రలో 45 కోట్లు, సీడెడ్ జిల్లాల్లో 15 కోట్లకు ఇప్పటికే విక్రమయమైంది.
ఈ సినిమా పూర్తిగా మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది. భారీ యాక్షన్ సీన్లు, కత్తి యుద్ధాలు ఆకట్టుకోనున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ పాత్ర పోషించనుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అందర్నీ ఆకర్షిస్తోంది. మరోవైపు ఈ సినిమా విడుదలకు ముందే సంచలనం రేపుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ కాంతారా ఛాప్టర్ 1 సినిమాను ఏకంగా 125 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.