విశ్వనటుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్ధత కారణంగా బుధవారం చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చేరిన సంగతి తెలిసిందే. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కమల్ హాసన్ హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. అయితే.. ఐదు దశాబ్దాలుగా చిత్రసీమలో నటుడిగా రాణిసున్న కమల్.. ఒక్కసారిగా అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరారని వార్త తెలిసేసరికి ఫ్యాన్స్ అంతా ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యం గురించి అప్ డేట్ ఏంటని ఎదురుచూస్తున్నారు. ఇటీవలే కమల్ హాసన్ హైదరాబాద్ లో దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్ ని కలిసి వెళ్లారు. ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇంతలోనే ఇలా హాస్పిటల్ లో చేరారని సమాచారం అందగానే ప్రేక్షకులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ప్రెస్ నోట్ ద్వారా కీలక ప్రకటన చేశారు. “జ్వరం, శ్వాస తీసుకోవడంలో కమల్ హాసన్ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ లోనే చికిత్స అందిస్తున్నాం. మరో రెండు, మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తాం. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి ఆందోళన చెందవద్దు” అని తెలిపారు వైద్యులు. ఇక కమల్ హాసన్ ఈ ఏడాది విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం విదితమే.
యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్.. కమల్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉండగా.. విక్రమ్ తర్వాత కమల్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైనప్ చేశాడు. డైరెక్టర్ శంకర్ తో భారతీయుడు 2 మూవీ చేస్తూనే.. మరోవైపు డైరెక్టర్ హెచ్. వినోద్ తో ఓ సినిమా, లోకేష్ కనగరాజ్ తో విక్రమ్-2 సినిమాలు చేయనున్నాడు. ఇక కమల్ హాసన్ త్వరగా కోలుకోవాలని, ఆయనకు ఏమి కాకూడదని అభిమానులు, సన్నిహితులు ప్రార్థనలు చేస్తున్నారు. ఓవైపు సినిమాలతో బిజీ అయినప్పటికీ, కమల్ హాసన్.. తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుండటం విశేషం.
Health update on Kamal Haasan From Shri Ramachandra Medical Centre!!
He is recovering well & will be discharged in one or two.#KamalHaasan pic.twitter.com/gUOOFGUdT0
— Behindwoods (@behindwoods) November 24, 2022