నేడు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి. ఈ సందర్భంగా Jr. NTR ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు.
నందమూరి తారకరామారావు (NTR).. ఈ పేరు వింటే చాలు ఇటు సినిమా ప్రపంచం నుంచి మొదులు కొని.., అటు రాజకీయాల వరకు ఆయన పేరు మారుమోగుతూనే ఉంటుంది. సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ పేజీని లిఖించుకుని నటసార్వభౌమునిగా నిలిచిపోయారు. ఇక రాజకీయాల్లో సైతం తన పరిపాలనతో ఎంతో మంది పేద ప్రజలకు సేవ చేసి గొప్ప నాయకుడిగా ఎదిగిపోయారు ఎన్టీఆర్. నేడు ఆయన శత జయంతి కావడంతో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తాతను స్మరించుకున్నారు. శత జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం Jr. NTR హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పక్కన ఉన్న ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. కాగా, Jr. NTR వస్తున్నారని తెలుసుకుని హైదరాబాద్ నలుమూలల నుంచి ఆయన అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఆయనను కలుసుకుని ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అనంతరం తన తాతను తలుచుకుంటూ Jr. NTR ట్విట్టర్ ఓ పోస్ట్ చేశారు. అందులో ఏముందంటే?.. మీ పాదం మోపాక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత.. అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా, హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ కు Jr. NTR తో పాటు బాలకృష్ణ, పురంధేశ్వరి, రామకృష్ణ, రాజేంద్రప్రసాద్ తదితరులు నివాళులర్పించారు.
మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 pic.twitter.com/veKcoCWamx
— Jr NTR (@tarak9999) May 28, 2023