ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో కాగా, మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హైవోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్. కేజీఎఫ్ ఛాప్టర్1, ఛాప్టర్2 వంటి హైవోల్టేజ్ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్, తారక్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు. కొరటాల శివ గురించి చెప్పాల్సిన పని లేదు. జనతా గ్యారేజ్ లాంటి సాలిడ్ హిట్ ఇచ్చారు. మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా అంటే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ న్యూ లుక్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ తన లుక్ ని పరిచయం చేస్తూ ఒక యాడ్ లో రఫ్ఫాడించారు. ఎన్టీఆర్ ఎందులో వేలు పెట్టినా అది పక్కాగా హిట్ అవుతుంది. సినిమాల్లో అయినా, బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి బుల్లితెర షోస్ లో అయినా, నవరత్న ఆయిల్, యాపీ ఫిజ్ వంటి యాడ్స్ లో అయినా సరే.. తారక్ దిగితే మైండ్ బ్లాక్ అంతే. అసలు తారక్ డైలాగ్ వింటేనే మెంటల్ వచ్చేస్తుంది. తాజాగా తారక్ చేసిన ఒక యాడ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పాపులర్ ఆన్ లైన్ మీట్ స్టోర్ ‘లీషియస్’కి బ్రాండ్ అంబాసిడర్ గా తారక్ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా తారక్ నటించిన యాడ్ ను రిలీజ్ చేసింది కంపెనీ. మంచి కాన్సెప్ట్ కి తోడు ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అదిరిపోయింది. ఈ యాడ్ లో తారక్ తో పాటు రాహుల్ రామకృష్ణ కూడా నటించారు. మేకింగ్ వీడియోలా ఈ యాడ్ ని చిత్రీకరించారు.
కోర్టు బ్యాక్ డ్రాప్ లో షూట్ చేశారు. అయితే తారక్.. ‘ఇంపాజిబుల్ యువర్ హానర్’ అని డైలాగ్ చెప్పడం.. మళ్ళీ రీటేక్ తీసుకోవడం జరుగుతుంది. వెంటనే రాహుల్ రామకృష్ణ.. ‘ఆరు పేజీల డైలాగ్ ని అర సెకనులో చెప్పగలరు.. మీకు ఇంత చిన్న డైలాగ్ కి’ అని అంటుండగానే.. ఎన్టీఆర్ తగులుకుని.. ‘చేప చిన్నదే అయినా ఎర పెద్దది వెయ్యాలి. లీషియస్ ప్రతి రోజూ 23 వేర్వేరు ప్రాంతాల నుంచి చేపల్ని ఫ్రెష్ గా ఎంపిక చేసి.. ఫ్లైట్ లో ట్రాన్స్ పోర్ట్ చేసి, డోర్ కి డెలివరీ చేస్తారు. సింగిల్ చేపైనా.. సేమ్ ప్రాసెస్.. నాలాగే. డైలాగ్ చిన్నదే అయినా డైలెక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి’ అంటూ తారక్ కంపేర్ చేస్తూ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో తారక్ మేకోవర్ కూడా చాలా బాగుంది. ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
. @tarak9999’s new ad for #Licious pic.twitter.com/vjj2ndWeUl
— Aakashavaani (@TheAakashavaani) November 23, 2022
BTS of #Licious AD @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/1vKvX0UOOY
— AndhraNTRFC (@AndhraNTRFC) November 22, 2022