తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీగా ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కించాడు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా.. 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ భారీగా ప్రమోషన్స్ జరుపుతున్నారు. అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఎన్టీఆర్ మాత్రమే హైలైట్ అవుతున్నాడు. ఎందుకంటే.. ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ అనే విషయం అందరికి తెలిసిందే.
కానీ ఎన్టీఆర్ మల్టీ లాంగ్వేజెస్ అనర్గలంగా మాట్లాడగలడని చాలావరకు తెలీదు. ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ ముంబైలో జరిగితే హిందీలో మాట్లాడి సర్ప్రైజ్ చేసిన ఎన్టీఆర్.. చెన్నైలో ఫ్లూయెంట్ గా తమిళం – కర్ణాటక వెళ్తే కన్నడ భాషలో స్పీచ్ అదరగొట్టాడు. ఇంతకాలం ఇన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడని ఎన్టీఆర్ ఫాన్స్ కి కూడా తెలియదు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి తెలుగులో మాత్రమే కాకుండా తమిళం – హిందీ – కన్నడ భాషల్లో ఓన్ డబ్బింగ్ చెప్పడం విశేషం.
నిజానికి ఎన్టీఆర్ మల్టీ టాలెంట్ గురించి ఇప్పుడు షాక్ అవుతున్నాం. కానీ ఎన్టీఆర్ ఎప్పుడో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాల్సిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇటీవల రిలీజైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. చూడలి మరి ఎన్టీఆర్ వాయిస్ తో నాలుగు భాషల్లో తన అభిమానులకు విందు భోజనం పెడతాడేమో! ఎన్టీఆర్ మల్టీ లాంగ్వేజ్ ఫ్లూయెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.