Jr NTR Fan: సినీ హీరోలకు, అభిమానులకు మధ్య బంధం అనేది వెలకట్టలేనిది. ఎప్పుడూ నేరుగా కలవకపోయినా, తమ పేరు హీరో నోటినుండి రాకపోయినా.. హీరోలను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులు ఎంతోమంది ఉంటారు. ఎల్లప్పుడూ అభిమాన హీరోలు బాగుండాలని కోరుకునే ఫ్యాన్స్.. ఫ్యాన్స్ బాగుండాలని కోరుకునే హీరోలు.. ఇదే వెలకట్టలేని బంధం. కొన్నిసార్లు హీరోకు ఏమైనా ఫ్యాన్స్ తట్టుకోలేరు. కొన్నిసార్లు ఫ్యాన్స్ కి ఏమైనా హీరోలు తట్టుకోలేరు. ప్రస్తుతం అలాంటి బాధలోనే ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు సమాచారం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జనార్ధన్.. ఎన్టీఆర్ ని అమితంగా ఆరాధిస్తాడు. ఎన్టీఆర్ పై ప్రేమతో తన చేతిపై ఎన్టీఆర్ పేరును పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరాడు జనార్ధన్.
ఆ ప్రమాదంలో జనార్ధన్ కోమాలోకి వెళ్లిపోయాడు. కేవలం ఎన్టీఆర్ పేరు వినిపిస్తేనే జనార్ధన్ లో కదలికలు కనిపించేవని వైద్యులు సైతం చెప్పారు. ఈ నేపథ్యంలో వీరాభిమాని విషమ పరిస్థితి ని తెలుసుకున్న ఎన్టీఆర్.. జనార్ధన్ అమ్మగారికి ఫోన్ చేసి మరి జనార్ధన్ ఆరోగ్యం విషయమై పరామర్శించదమే కాకుండా.. జనార్దన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాడు.
ఇక ఎన్టీఆర్ తో పాటు ఆయన అభిమానులు సైతం జనార్ధన్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించినా.. లాభం లేకుండా పోయింది. చివరికి విషాదమే మిగిల్చి.. తుదిశ్వాస విడిచాడు జనార్ధన్. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. మరి అభిమాని మరణవార్త ఎన్టీఆర్ కి తెలిసిందా లేదా అని తెలియలేదు. కానీ.. వీరాభిమాని ప్రాణాలు కోల్పోయాడని వార్త తెలిస్తే ఎన్టీఆర్ ఎంత బాధపడతాడో చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జనార్ధన్ కి నెట్టింట సంతాపం తెలియజేస్తున్నారు. మరి మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#NTR Always Fan Of his Fans#PrayForJanardhan
pic.twitter.com/H9bhMSNjIY— 𝗡𝗧𝗥 𝗡𝗲𝘁𝘄𝗼𝗿𝗸 ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@WeLoveTarakAnna) June 29, 2022