సాధారణంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే ఆ సినిమా తాలూకు హీరో ఫ్యాన్స్ లో ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఎక్కడ ఈవెంట్ ఉంటే అక్కడికి ఫ్యాన్స్ చేరుకొని ఈవెంట్ ని సక్సెస్ చేస్తుంటారు. కానీ.. తాజాగా పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ విషయంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడం అందరినీ నిరాశకు చేసింది. ఎందుకంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా వస్తాడని టికెట్స్ కొనుక్కొని రెడీ అయిన ఫ్యాన్స్ కి ఈవెంట్ క్యాన్సల్ అయ్యిందనే తెలిసేసరికి నిరాశకు గురయ్యారు.
దీంతో వెంటనే ఈవెంట్ క్యాన్సల్ అయితే.. కనీసం ప్రెస్ మీట్ అయినా జరపాలని చిత్రబృందం, సమర్పకుడు రాజమౌళి భావించారు. ఇక హైదరాబాద్, పార్క్ హయాత్ హోటల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. రాజమౌళి ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సల్ అయ్యింది. వినాయక నిమర్జన కార్యక్రమాలు జరుగుతుండటంతో చివరి నిమిషంలో పోలీసు వారు ప్రొటెక్షన్ సరిపోదని చెప్పడంతో ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు.
ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ముందుగా నా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను. ఎంతో ఆర్భాటంగా వేడుక చేయాలని ప్లాన్ చేశారు. కానీ.. పోలీసులు సరిపడా భద్రతను కల్పించలేమని చెప్పారు. వారి మాటలను వినాల్సిన బాధ్యత భారత పౌరులుగా మనకుంది. అందుకే చేయాల్సిన ఈవెంట్ చేయలేకపోతున్నాం. ఇక్కడకు అభిమానులు రాలేకపోయినందుకు వారికి క్షమాపణలు చెప్పుకుంటున్నాం. ఈవెంట్‌కి రాలేకపోయినప్పటికీ అభిమానులు మంచి సినిమాలను, నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా’’ చెప్పాడు. ఇక బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతోంది. మరి ఎన్టీఆర్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.