దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలింది ప్రముఖ నటి దివంగత శ్రీదేవి. తన చూడచక్కని అందంతో తెలుగునాట అప్పటి తరం నటులందరితోనూ ఆడిపాడింది. వందలాది సినిమాల్లో నటించి అగ్రశ్రేణి కథానాయికగా రాణించింది. ఇక శ్రీదేవి సినిమా అంటే అంచనాలే వేరు. ఆమె డేట్స్ కోసం డైరెక్టర్స్ సైతం వెయిట్ చేసే పరిస్థితి ఉండేది. అలా తెలుగు, తమిళం, మళయాళం, హిందీ వంటి భాషల్లో నటించి 2018లో మరణించింది.
అలా కొ్న్ని రోజుల తర్వాత శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ సినిమాల్లోకి అడుగుపెట్టింది. జాన్వీ తన అందంతోనే కాకుండా నటనలోను తల్లి పేరును నిలబెడుతోంది. దడక్ సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ సుందరి నటనలోను తక్కువ కాదంటోంది. ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది ఈ భామ. ఇక తాజాగా తన పెళ్లి గురించి మొదటిసారిగా స్పందించింది జాన్వీ కపూర్.
పెళ్లి అనేది లైఫ్‌లో ఒక్కసారే వస్తుందని, దీని హ్యాపీ గా సెలబ్రేట్ చేసుకోవాలని సూచించింది. దీంతో పాటు నాకు రాబోయే భర్త బాగా తెలివిగలవాడైతే పెళ్లి మూడు పూర్తి చేసుకోవాలని అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక కాప్రీ ఐలాండ్‌లో బోట్‌లో ప్రయివేట్ పార్టీ ఎంజాయ్ చేయటం, చెన్నై-మైలాపూరంలో అమ్మ నివసించిన చోట మెహందీ వేసుకోవటం, ఆ తర్వాత సంగీత్ ఫంక్షన్‌లు జరుపుకోవాలని తెలిపింది. ఇక ప్రధానంగా సాంప్రదాయ చీరకట్టుతో తిరుపతిలో చేసుకుంటానని జన్వీ కపూర్ తన పెళ్లిపై మనసులోని మాట బయటపెట్టింది.